మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. తండ్రిని కొడుకు, తల్లిని కూతురు చంపేశారు..

Subscribe to Oneindia Telugu
హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ మహిళ తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కన్నతల్లినే హత్య చేసింది. హత్యానంతరం తల్లి శవంతో అదే ఇంట్లో వారం రోజులపాటు ఆమె గడపడం గమనార్హం.

పోలీసులు వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్ పేట్ మండలం ఇప్పతూరు గ్రామంలో వారం క్రిత ఈ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి నర్సమ్మ(70) మద్యానికి తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో కన్నకూతురు పార్వతమ్మే ఆమెను హత్య చేసింది.
వారం రోజుల తర్వాత ఇంటినుంచి శవాన్ని తరలించేందుకు పార్వతమ్మ ప్రయత్నిస్తుండటాన్ని స్థానికులు గమనించడంతో విషయం వెలుగుచూసింది.

Son killed dad for booze; now, daughter kills mom

కాగా, నాలుగేళ్ల క్రితం ఇదే ఇంట్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మద్యానికి బానిసైన నర్సమ్మ పెద్ద కొడుకు సైతం తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో తండ్రిని హత్య చేశాడు. కాగా, మద్యానికి బానిసవడం వల్ల పార్వతమ్మ వైవాహిక జీవితం కూడా దెబ్బతిన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లవగా.. మద్యం అలవాటు మానకపోవడంతో ఆమె పుట్టింటికే పరిమితమైంది. తల్లి నర్సమ్మకు వచ్చే పెన్షన్ మీదే పార్వతమ్మ కూడా బతుకుతోంది. ఇదే క్రమంలో వారం క్రితం మద్యానికి డబ్బులు కావాల్సిందిగా నర్సమ్మను పార్వతమ్మ వేధించింది. పార్వతమ్మ డబ్బులు ఇవ్వకపోవడంతో కర్రతో ఆమె తలమీద కొట్టింది.

నర్సమ్మ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. అనంతరం కిరోసిన్ పోసి మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో నర్సమ్మ కనిపించకపోవడం పట్ల చుట్టుపక్కల జనం ప్రశ్నించడంతో బంధువుల ఇంటికి వెళ్లిందని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది.

అయితే బుధవారం రాత్రి ఈ తతంగం మొత్తాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. అనంతరం పార్వతమ్మ నేరాన్ని అంగీకరించింది. తాగిన మత్తులో తానే హత్య చేసినట్లు నర్సమ్మ ఒప్పుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Angry at being refused money to buy alcohol, an alcohol addict killed her 70-year-old mother and stayed in the same room, with the body, for a week.
Please Wait while comments are loading...