అన్నం పెట్టలేదని తల్లిని ఏం చేశాడంటే, తండ్రిని కూడ అలానే చంపాడు

వికారాబాద్ : టెక్నాలజీ పెరుగుతోంది.అనేక అద్భుతాలను మనిషి చేస్తున్నాడు,. కాని, రోజులు మారుతున్న కొద్దీ మనిషి మానవత్వ లక్షణాలు కోల్పోతున్నాడు. గతంతో పోలిస్తే మానవవత్వం ఉన్న మనిషి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న విషయాలకే గొడవ పడడం, చంపేయడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.అన్నం పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.తండ్రిని కూడ ఇదే తరహలో చంపాడు ఆ తనయుడు.

మాయమౌతున్నాడమ్మ, మనిషన్నవాడు, మచ్చకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని అందెశ్రీ రాసిన పాట గుర్తుకొస్తోంది. మనిషిలో మానవత్వం జాడలు మృగ్యమౌతున్నాయి. చిన్న విషయాలకు హత్య చేసే పరిస్థితులకు పూనుకొంటున్నారు.

 son murder his mother she reject put for food

నాడు తండ్రిని నేడు తల్లిని చంపాడు
వికారాబాద్ జిల్లాలోని గంగారం కు చెందిన అంజమ్మ తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చిన కొడుకు వెంకటేష్ తనకు అన్నం వడ్డించాలని తల్లిని కోరాడు. అయితే తనకు అలసటగా ఉందని వడ్డించుకోని తినాలని తల్లి చెప్పింది. దీంతో ఆతను ఆగ్రహంతో ఆమెను హత్య చేశాడు.

గతంలో తండ్రిని కూడ చిన్న విషయానికే హత్య చేశాడు వెంకటేష్. అకారణంగా తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మరిచిపోకముందే అన్నం వడ్డించలేదని తల్లిని కూడ అతను గొంతుపిసికి చంపేశాడు.చిన్న విషయాలకే ఆగ్రహానికి గురైన వెంకటేష్ హత్య చేయడం సంచలనం కల్గించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తండ్రిని కూడ ఈ రకంగానే హత్యచేశారని వెంకటేష్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+