• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స‌న్ స్ట్రోక్ ఎంత ప్ర‌మాదక‌రం..!! డీయ‌స్ అవ‌మాన‌క‌ర నిష్క్ర‌మ‌ణ‌..

|
  డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు

  సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ త‌న‌పైన వ‌చ్చిన ఆరోప‌ణ‌కు వివ‌ర‌ణ ఇచ్చుకునే అవ‌కాశం లేకుండాపోయింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసి త‌న ప‌రిస్థితిని మొర‌పెట్టుకుందామ‌నుకున్న ప‌ట్టించుకునే నాథుడు క‌రువ‌య్యాడు. దీంతో డీయ‌స్ అలియాస్ డి.శ్రీ‌నివాస్ అనే సీనియ‌ర్ నాయ‌కుడికి అదికార పార్టీ నుంచి అవమానకర నిష్కమ్రణ ఖాయమైంది. ఆయనను టీఆర్ఎస్ నుంచి గెంటేయడానికి రంగం సిద్ధమైంది. తనకు తానుగా పార్టీ నుంచి వెళ్లిపోవడమా లేక కేసీఆర్ నుంచి బహిష్కరణ ఆదేశాలు తీసుకోవడమా అన్నది ఇప్పుడు డి.ఎస్ చేతులో ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన శ్రీనివాస్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించ లేదు.

  బీసి నేత‌గా తెలంగాణ‌లో చ‌క్రం తిప్పిన నాయ‌కుడు..

  బీసి నేత‌గా తెలంగాణ‌లో చ‌క్రం తిప్పిన నాయ‌కుడు..

  ఆయన టీఆర్ఎస్ లో చేరడం పెద్ద సంచలనం అయితే ఇప్పుడు ఆదే పార్టీ నుంచి బయటకు వెళ్తున్న తీరు మరో సంచలనంగా మారింది.డి.ఎస్ పార్టీలో ఉంటు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనేది నిజామాబాద్ టీఆర్ఎస్ నేత ఆరోపణ. దీనిపైన వారంతా ఉమ్మడిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఫిర్యాదు చేశారు. దీనిపైన సి.ఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే డి.ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో కేసీఆర్ కొంత ఆచితూచి స్పందించనున్నారు. టీఆర్ఎస్ నుంచి తనకు తానుగా డి.ఎస్ వెళ్లిపోయింత వరకు చంద్రశేఖర్ రావు ఓపిక పట్టే అవకాశముంది.

  డి.ఎస్ చిన్నకుమారుడు అర‌వింద్ బీజేపీలో చేరడంతోనే నిజామాబాద్ టీఆర్ఎస్ లో ముసలం ప్రారంభమైంది. తండ్రి టీఆర్ఎస్ లో ఉన్నప్పటికి అర్వింద్ మాత్రం బీజేపీని ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరుపున నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర‌వింద్ విస్రుత్తంగా పర్యటిస్తు టీఆర్ఎస్ పైన నిప్పులు చెరుగుతున్నారు. ఎం.పి కవితను టార్గెట్ చేస్తున్నారు.

  'స‌న్' స్ట్రోక్ ఎంత ప్ర‌మాద‌మో తెలుసుకోలేక పోయిన డీయ‌స్..

  'స‌న్' స్ట్రోక్ ఎంత ప్ర‌మాద‌మో తెలుసుకోలేక పోయిన డీయ‌స్..

  నిజామాబాద్ లోక్ సభ పరిధిలో బీజేపీకి మంచి పట్టుండటంతో అర‌వింద్ భవిష్యత్తులో ప్రమాదకరం అవుతారన్న భావనకు ఎం.పి కవిత వచ్చారు. ఆయనను నియంత్రించాలని డి.ఎస్ కు పలు మార్లు సూచించినట్లు సమాచారం. అయితే అర్వింద్ తన మాట వినడం లేదని ఆయన టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో డి.ఎస్ అనుచరుల మాట టీఆర్ఎస్ లో చెల్లుబాటు కాకుండా పోయింది. ఆయన వర్గానికి ఎలాంటి పదవులు దక్కకుండా కవిత పావులు కదుపుతున్నారు. దీంతో పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఇటీవల డి.ఎస్ ముందే ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడమే మేలని వారు ఆయనకు బహిరంగంగానే సూచించారు.

  మరో వైపు టీఆర్ఎస్ లో ఉన్న తన అనుచరులు, కుల సంఘాలను కొడుకు అర్వింద్ కు అనుకూలంగా పనిచేయాలని డి.ఎస్ సూచిస్తున్నారని కవిత అనుమానిస్తున్నారు. పార్టీలో ఉంటు కుమారుడి విజయం కోసం ఆయన పావులు కదుపుతున్నారని అంచనాకు వచ్చారు. అందుకే ఆయనను టీఆర్ఎస్ నుంచి పంపించడానికి ఆమె సిద్ధమయ్యారు.

  గులాబీ కండువా క‌ప్పుకున్నాక ఢీలా ప‌డిపోయిన డీయ‌స్..సొంత పార్టీ వైపు చూపు..

  గులాబీ కండువా క‌ప్పుకున్నాక ఢీలా ప‌డిపోయిన డీయ‌స్..సొంత పార్టీ వైపు చూపు..

  జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిని డి.ఎస్ కు వ్యతిరేకంగా కవిత ఏకం చేశారు. కాంగ్రెస్ లో దాదాపు పదేళ్ల పాటు చక్రం తిప్పారు డి.శ్రీనివాస్. రెండు సార్లు పీసీసీ ఛీప్ గా మంచి పేరుతెచ్చుకున్నారు. నాయకులను సమన్వయం చేయడంలో డి.ఎస్ దిట్ట. కాంగ్రెస్ లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వాహ కొనసాగుతున్న సమయంలో కూడా డి.ఎస్ తనకు ఒక గుర్తింపును తెచ్చుకోగల్గారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో డి.ఎస్ ముఖ్యమంత్రి రేస్ లో నిలబడ్డారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ లో మంచి అవకాశాలు దక్కేవి. అయితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అవమానించారన్న ఆగ్రహంతో డి.ఎస్ ఆ పార్టీని వదిలిపెట్టారు. రెడ్డి సామాజికవర్గం వాహ ముందు తట్టుకోవడం కష్టమని భావించిన ఆయన ఆవేశంతో గులాబీ కండువా కప్పుకున్నారు. డి.ఎస్ శ్రీనివాస్ కాంగ్రెస్ ను వదలడం అప్పట్లో సంచలనమైంది. అయితే ఆయన సీనియార్టీని ద్రుష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఆయనకు మంచి పదవులను అప్పగించారు. క్యాబినెట్ హోదా తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో పాటు రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు.

  టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఇత‌ర నేత‌ల‌కు మాదిరిగానే డీయ‌స్ కు కూడా అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌ని కేసీఆర్..

  టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఇత‌ర నేత‌ల‌కు మాదిరిగానే డీయ‌స్ కు కూడా అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌ని కేసీఆర్..

  కాని రాజకీయంగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే డి.ఎస్ టీఆర్ఎస్ వ్యవహారాల్లో మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కనీసం వేదిక పైన కూడా ఆయనకు కుర్చీ లేకుండా పోయింది. కేసీఆర్ కూడా డి.ఎస్ సీనియార్టీని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో చాలా కాలం నుంచి డి.శ్రీనివాస్ లోలోన మధన పడుతున్నారు. కాంగ్రెస్ ను అనవసరంగా వదిలిపెట్టాననే భావనలో ఆయన ఉన్నట్లు అనుచురులు చెపుతున్నారు. ఎన్నికల నాటికి తిరిగి సొంత పార్టీ గూటికి చేరుకోవాలని డి.ఎస్ భావిస్తున్నారు. వాతావరణాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ ఆయనను వదిలించుకోడానికి స్కెచ్ గీసింది. మొత్తానికి డి.శ్రీనివాస్ లాంటి సీనియర్ నేత వేసిన ఒక్క తప్పటడుగు ఆయన రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  telangana senior leader d.srinivas is going to leave trs party. nizamabad trs leaders including mp kavitha daughter of cm kcr is alleging on d.srinivas that he is working for another party. on this issue nizamabad trs leaders wrote a letter to cm kcr stating that action should be taken on d.srinivas. d. srinivas waiting for cm decision and later he planning to join in congress party.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more