వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనీది హత్యే: తండ్రే హంతకుడు, చంపేసి కథ అల్లాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: సోనీది ఆత్మహత్య కాదని, హత్యేనని తేలింది. పైగా తండ్రే హంతకుడనే విషయం కూడా బయటపడింది. మండలం కోసం ఆమె ఆత్మహత్య చేసుకుందని మొదట భావించినప్పటికీ ఆ తర్వాత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు.

నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలలో ఈ నెల 14వ తేదీన సోనీ మరణించింది. ఆమె గట్టుప్పల మండలం ఏర్పాటు కోసం ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. అది తండ్రి కల్పించిన కట్టుకథ అని, ఆమెను తండ్రే చంపాడని పోలీసులు తేల్చారు. హత్య వివరాలను సోమవారం నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ వెల్లడించారు.

14వ తేదీన సోని తండ్రి బొడిగ కృష్ణయ్యకు తెలియకుండా అతడి కుమారుడు శేఖర్‌ బైక్‌ తీసుకెళ్లడంతో ఇంట్లో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తండ్రి కృష్ణయ్య ఇద్దరు కూతుళ్లు సోని, మానసలతో గొడవకు దిగాడు. అయితే, మధ్యలో మానస బయటికి వెళ్లిపోయింది. మానసిక వికలాంగురాలైన సోని మాత్రం తండ్రితో గొడవను కొనసాగించింది.

Soni murder at Gattuppala: father is the killer

కోపాన్ని తట్టుకోలేని కృష్ణయ్య ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె దర్వాజకు వెళ్లి తగిలింది. తల వెనుకభాగంలో బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కృష్ణయ్య కూతురి మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. కొద్దిసేపటి తరువాత ఏమీ తెలియనట్లు గ్రామంలో మండలం కోసం జరుగుతున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి కూర్చున్నాడు.

బాతరూంలో కాలిఉన్న సోని మృతదేహాన్ని చూసి మానస వెంటనే తల్లిదండ్రుల వద్దకు వచ్చి చెప్పింది. శిబిరం వద్ద ఉన్న గ్రామస్థులందరూ సంఘటనా స్థలానికి వెళ్లారు. మండలం కోసమే ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెప్పాడు. పోలీసులు తండ్రి కృష్ణయ్య గత చరిత్రపై విచారణ నిర్వహించారు.
కృష్ణయ్యగతంలో ఓ హత్య కేసులో కారాగార శిక్ష అనుభవించాడు. పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులో తీసుకొని విచారించారు. దీంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య కేసును రెండు రోజుల్లోనే తేల్చిన ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డిని, ఐడీ పార్టీ సిబ్బంది రవూఫ్‌, విష్ణును డీఎస్పీ అభినందించారు.

English summary
Police said that Soni, a girl from Gattuppala village of nalgonda district has been killed by her father Krishnaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X