భరత మాతగా సోనియా గాంధీ..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.

ఈ పరిణామాల మధ్య అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ తన రూటును మార్చింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కర్ణాటక తరహా ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చింది. కర్ణాటకలో పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన పథకాలను ఇక్కడా ప్రకటించింది. మొత్తంగా ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల ముందు ఉంచింది కాంగ్రెస్.
ఇందులో అత్యంత కీలకమైనది- మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. తుక్కుగూడలో ఏర్పాటైన బహిరంగ సభలో స్వయంగా సోనియా గాంధీ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు.
అలాగే- తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు సోనియా గాంధీ. గృహలక్ష్మి పేరుతో ఈ పథకం కూడా కర్ణాటకలో అమల్లో ఉంది. అక్కడ ప్రతి నెలా 2,000 రూపాయలను చెల్లిస్తోంది సిద్ధరామయ్య సర్కార్. ఇక 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే గృహజ్యోతి పథకాన్ని తాము అమలు చేస్తామని హామీ ఇచ్చారు సోనియా. ఈ పథకం కింద గృహావసర వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఒక్క రూపాయి కూడా బిల్లు తీసుకోని ఇదే పథకం ప్రస్తుతం కర్ణాటకలో అమలులో ఉంది.
ఇందిరమ్మ ఇండ్లు కింద సొంతిల్లు లేని మహిళలందరికీ ఇంటి పట్టాతో పాటు, నిర్మాణం కోసం అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరికీ 250 చదరపు అడుగుల ప్లాట్‌ను మంజూరు చేస్తామని చెప్పారు. విద్యా భరోసా కార్డ్ కింద అయిదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, చేయూత కింద ప్రతి నెలా 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
కాగా- తుక్కుగూడ సభలో ఓ కటౌట్ ఆకట్టుకుంది. సోనియా గాంధీని భరత మాతగా చిత్రీకరించారు ఇందులో. భరత మాత కటౌట్‌కు సోనియా గాంధీ ముఖాన్ని తగిలించారు. సభా ప్రాంగణం పరిసరాల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications