వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలహాలిచ్చారు: దాసరిపై సోనియా గాంధీ, 'అమ్మ' కోరిక నెరవేరకుండానే..

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు దాసరి నారాయణ రావు మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతి తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు దాసరి నారాయణ రావు మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతి తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

<strong>దాసరి మృతదేహాన్ని చూసి ఏడ్పు ఆపుకోలేకపోయిన మోహన్ బాబు</strong>దాసరి మృతదేహాన్ని చూసి ఏడ్పు ఆపుకోలేకపోయిన మోహన్ బాబు

ప్రజాసేవ పట్ల ఆయనెంతో నిబద్ధతతో ఉండేవారని సోనియా కొనియాడారు. కేంద్రమంత్రిగా వివిధ చర్చల్లో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చేవారన్నారు.

పార్టీ గుర్తుంచుకుంటుంది

పార్టీ గుర్తుంచుకుంటుంది

పార్లమెంటు సభ్యుడిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఆయన చేసిన సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందని సోనియా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, దాసరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

చివరి కోరిక నెరవేరకుండానే దాసరి..

చివరి కోరిక నెరవేరకుండానే దాసరి..

దాసరి నారాయణ రావు తన చివరి కోరికను నెరవేర్చుకోకుండానే వెళ్లిపోయారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఓ చిత్రాన్ని తీయాలనుకున్నారు దాసరి. కానీ ఆ కోరిక నెరవేరకుండానే మృతి చెందారు.

అమ్మ అనే టైటిల్

అమ్మ అనే టైటిల్

జయలలిత మృతి తర్వాత ఆమె జీవిత చరిత్రలో తనకు తెలిసిన విషయాలతో పాటు, తెలియని విషయాల గురించి పలువురితో దాసరి చర్చలు కూడా జరిపారు. తాను నిర్మించ తలపెట్టిన జయలలిత బయోపిక్ కు 'అమ్మ' అన్న టైటిల్‌ను కూడా అనుకున్నారు.

పవన్ కళ్యాణ్‌తోను..

పవన్ కళ్యాణ్‌తోను..

అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో కలసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని కూడా దాసరి భావించారు. ఓ సినిమా ఫంక్షన్లో ఇదే విషయాన్ని దాసరి చెప్పారు. దానికి పవన్ సైతం ఆయనతో తన చిత్రం తప్పకుండా ఉంటుందన్నారు. ఈ కోరికలు తీరకుండానే మృతి చెందారు.

ఆయనకిష్టమైన ఫాంలోనే..

ఆయనకిష్టమైన ఫాంలోనే..

దాసరి అంత్యక్రియలు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని ఆయన ఫాంహౌస్‌లో జరగనున్నాయి. 2011 అక్టోబర్ 28న దాసరి పద్మ కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా కుంగిపోయారని అంటారు. దాసరి అంత్యక్రియలు కూడా ఈ పాంహౌస్‌లోనే జరుగుతాయి. ఈ ఫాంహౌస్ అంటే ఆయనకు ఇష్టం.

చెన్నై ఆటో కార్మికులకు గౌరవం

చెన్నై ఆటో కార్మికులకు గౌరవం

ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహిస్తుండగా, ఆ భారం తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండే వారు. దాసరి దర్శకత్వం వహించిన శివరంజని, ఒసేయ్‌ రాములమ్మ, మజ్ను, ఒరేయ్‌ రిక్షా, మేఘసందేశం వంటి పలు చిత్రాలకు ఆమె నిర్మాతగా ఉన్నారు. సొంతడబ్బు ఖర్చు పెట్టి మరీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ఆమె అంటే, చెన్నై ఆటో కార్మికుల సంఘానికి ఎంతో గౌరవం. ఆటో డ్రైవర్ కాకున్నా ఆ మంచిగుణమే పద్మను ఆటో సంఘానికి అధ్యక్షురాలిని చేసింది.

English summary
AICC president Sonia Gandhi expressed condolence over death of Film Direcor and former Union Minister Dasari Narayana Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X