చర్లపల్లి నుంచి అరుణాచలం వెళ్లే ప్రత్యేక రైలు పొడిగింపు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు

పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, ఛత్ పూజ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మొత్తం 98 ప్రత్యేక సర్వీసులు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు అక్టోబర్ నుండి నవంబర్ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపు వల్ల తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పినట్టయింది. ప్రత్యేకించి.. పండగ సెలవుల్లో అరుణాచలం, తిరుపతికి వెళ్లాలనుకునే వారికి తీపి కబురు ఇచ్చినట్టే. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాల కోసం సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య కూడా సర్వీసులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

South Central Railway extends Weekly Special Trains to Beat Festival Season Across Key Destinations

ఈ రైళ్ల పొడిగింపు వల్ల పండగ సీజన్‌లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ల లభ్యత సులువవుతుంది. ఛత్ పూజ సమయానికి బీహార్, జార్ఖండ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ సర్వీసులు ఎంతో తోడ్పడతాయి. శబరిమల సీజన్ ప్రారంభమయ్యే సమయంలో కొల్లం రూట్ లో ఈ అదనపు సర్వీసులు కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు అనుకూలంగా ఉంటాయి.

బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
  • 07046 / 07047 సికింద్రాబాద్ - నహర్లగన్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను అక్టోబర్ 2 నుంచి పొడిగించారు. ఇది నవంబర్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శని, సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
  • 07193 / 07194 హైదరాబాద్ - కొల్లం వీక్లీ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 3వ తేదీ నుంచి పొడిగించారు. నవంబర్ 30వ తేదీ వరకు ప్రతి శని, సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
  • 07425 / 07426 సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ప్రతి అక్టోబర్ 4 నుండి నవంబర్ 30 వరకు ప్రతి ఆది, సోమవారాల్లో రాకపోకలు సాగిస్తుంది.
  • 07001 / 07002 చర్లపల్లి - తిరువణ్ణామలై రైలు అక్టోబర్ 1 నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతి గురువారం / శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తుంది.
  • నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెలూరు కంటోన్మెంట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
  • 07814 / 07815 జాల్నా - తిరుపతి వీక్లీ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 1 నుండి నవంబర్ 27వ తేదీ వరకు గురువారం / శుక్రవారాల్లో రాకపోకలు సాగిస్తుంది.
  • 07603 / 07604 నాందేడ్ - తిరుచానూర్ వీక్లీ ఎక్స్ ప్రెస్.. అక్టోబర్ 6 నుండి నవంబర్ 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం / బుధవారాల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
  • 03253 పాట్నా- చర్లపల్లి ఎక్స్ ప్రెస్ ఈ నెల 21 నుంచి నవంబర్ 30, 03254 చర్లపల్లి- పాట్నా ఈ నెల 23 నుంచి డిసెంబర్ 12, 03255 చర్లపల్లి పాట్నా ఎక్స్ ప్రెస్ ఈ నెల 25 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+