విశాఖ వందే భారత్ సహా 25 రైళ్ల టైం టేబుల్ మార్పు, రేపటి నుంచే- కొత్త వేళలు..!!
రైల్వే ప్రయాణీకులకు కీలక అప్డేట్. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. 2026లో రైళ్ల రాకపోకలకు సంబంధించి మార్పులు జరిగాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్‌తో సహా మొత్తం 25 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు జరగను న్నాయి. కొత్త టైం టేబుల్ రేపటి నుంచి (జనవరి 1) అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి రైళ్ల వివరాలు.. కొత్త సమయాలు ప్రకటించారు.
రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసి కొత్త టైం టేబుల్ విడుదల చేసింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో వందేభారత్‌తో సహా 25 రైళ్ల రాకపోకల వేళల్లో 5 నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనున్నట్లు వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2026లో ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకున్న ప్రయాణికులు ప్రయాణానికి ముందే రైలు సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. కాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం (20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరే టైమ్ లో స్వల్ఫ మార్పు జరిగింది. ప్రస్తుతం ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 5 గంటల 5 నిమిషాలకు బయల్దేరుతుండగా జనవరి 1వ తేదీ నుంచి ఐదు నిమిషాలు ముందుగానే స్టార్ట్ కానుంది. అంటే, ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం(20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరనుంది.

ఇక, వందే భారత్ తో పాటు మరికొన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ టైమింగ్స్ కూడా మారాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757) రైలు బయల్దేరే సమయం మారింది. ప్రస్తుతం ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 8:20కి బయల్దేరుతోంది. అయితే, జనవరి 1 నుంచి పది నిమిషాలు ముందుగానే అంటే ఉదయం 8:10 నిమిషాలకే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే మరో కాకతీయ ఎక్స్‌ప్రెస్ టైమింగ్ కూడా మారింది.. ప్రస్తుతం సికింద్రాబాద్ - భద్రాచలం (17659) కాకతీయ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:25 గంటలకు బయల్దేరుతుండగా.. కొత్త ఏడాది జనవరి 1 నుంచి ఉదయం 5 గంటలకే సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. వీటితో పాటు మరికొన్ని రైళ్ల రాకపోకల సమయ వేళల్లో మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications