దక్షిణ భారత్ లో టాప్ 5 సీనిక్ ప్లేసెస్ ఇవే.. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే..!

భారత్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, నదులు, జలపాతాలు, హిల్ స్టేషన్లు, దట్టమైన అటవీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, అందమైన చారిత్రక కట్టడాలు ఇలా ఎన్నో ప్రాంతాలను పర్యాటకుల్ని మైమరపింపజేస్తాయి. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఎక్కడికైనా టూర్ కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే తెలుగు రాష్ట్రాలకు దగ్గరలోని ఈ ప్రాంతాలపై ఓ లుక్ వేయండి.. దక్షిణ భారత్ లోనే అందమైన పర్యాటక ప్రాంతాలుగా వీటికి పేరుంది.

వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది గోకర్ణ.. ఈ ప్రాంతం బెంగళూరుకు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. గోకర్ణలో మహాబలేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే గోకర్ణ అంటే అద్భుతమైన బీచ్ లు గుర్తుకువస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, యువతకు ఇది మరచిపోలేని అనుభూతిని కలిగించే ప్రదేశం. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం టూరిస్టులను కట్టిపడేస్తుంది. ఇక్కడ ఓం బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, గోకర్ణ బీచ్ చాలా ఫేమస్..

మున్నార్ ప్రాంతం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. సముద్రమట్టానికి 1600 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల్లో దాగి ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఈ ప్రాంతం. మున్నార్ ను సౌత్ ఇండియా కాశ్మీర్ గా పిలుస్తారు. మున్నార్ లో తేయాకు తోటలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక మున్నార్ కొండల్లో నీలకురింజి పుష్పాలు చాలా ఫేమస్.. ఇవి 12 ఏళ్లకోసారి పూస్తాయి. అలాగే మున్నార్ కు దగ్గరలో ఇరవికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, టాప్ స్టేషన్ చాలా ఫేమస్...

ఊటీ ప్రాంతం భారత్ హిల్ స్టేషన్స్ రాణిగా పిలుస్తారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఈ ప్రాంతం నెలకొని ఉంది. ఇది ఒక అందమైన స్వర్గధామం. పచ్చని కొండలు, మంచు తెరలు, బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు, తేయాకు తోటలు పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఊటీలోని నీలగిరి మౌంటెన్ రైల్వే కు ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా లభించింది. ఇక్కడి దోడబెట్ట శిఖరం, పైకారా జలపాతం చాలా ఫేమస్..

కొడైకెనాల్ తమిళనాడులో ఉంటుంది. కొడైకెనాల్ ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తుంటారు. దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, లోయలతో ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. పర్యటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడి సిల్వర్ కాస్కేడ్ ఫాల్స్, బేరిజం లేక్, పాంబార్ ఫాల్స్ లాంటి లొకేషన్స్ పర్యటకుల్ని థ్రిల్ కు గురి చేస్తాయి..

SouthIndia Most Beautiful Destinations Gokarna Munnar Coorg Ooty Kodaikanal Plan Your Trip Now

కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో దాగి ఉన్న పర్యాటక ప్రాంతం కూర్గ్.. కూర్గ్ ను స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. భారత్ లోని అత్యంత అందమైన టూరిస్టు ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి. దట్టమైన కాఫీ తోటలు, కొండలపైనుంచి దూకే జలపాతాలు, చుట్టూ మంచు తెరలు ఇవన్నీ పర్యటకుల్ని మైమరిపింపజేస్తాయి. ఇక్కడ అబ్బే ఫాల్స్, ఇరుప్పు ఫాల్స్ చాలా ఫేమస్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+