ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..
తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తలుచుకూంటూ కొడుకు ఎస్పీ చరణ్ తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు కొన్నిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం, ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చడం తెలిసిందే.
Recommended Video
తండ్రి హెల్త్ కండిషన్ పై చరణ్ గురువారం సాయంత్రం ఓ వీడియోను పోస్ట్ చేశారు. గానగంధర్వుడి ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యంపై హెల్త్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు, సినీ పరిశ్రమ చూపుతోన్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు.

''నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఎలాంటి పురోభివృద్ధి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్ ఇవ్వడం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఫలిస్తాయన్న నమ్మకముంది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు, సంగీత పరిశ్రమకు, దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు'' అని ఎస్పీ చరణ్ వీడియోలో పేర్కొన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోవాలని గురువారం సాయంత్రం 6:00 నుంచి 6:05 వరకు(ఐదు నిమిషాల పాటు) ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సామూహిక ప్రార్థనలు చేశారు. చెన్నై, హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో బాలు కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.












Click it and Unblock the Notifications