మసాజ్ ముసుగులో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, ఆదిత్య అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మసాజ్‌ సెంటర్ ముసుగులో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో పరారీలో ఉన్న నిందితుడిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు.

చిత్తూరుకు చెందిన పాపగారి ఆదిత్య హైదరాబాద్ వలసవచ్చి మాదాపూర్‌లో ఉంటున్నాడు. రాయదుర్గం, మాదాపూర్‌, సోమాజిగూడ, బంజారహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొంపల్లి ప్రాంతాల్లో ఏడు స్పా కేంద్రాలను ఏర్పాటు చేశాడు.

Spa centre: Cyberabad police arrested Aditya

అక్కడ మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. థాయ్‌లాండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గతనెల 19న పోలీసులు స్పా కేంద్రాల్లో దాడులు నిర్వహించినప్పుడు గుర్తించారు.

ప్రధాన నిందితుడైన ఆదిత్య పరారీలో ఉండగా చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a major crackdown on spas and massage centers, the Cyberabad police have arrested main accused Aditya.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X