తెలంగాణలో బాబుకు చెల్లు! టి టీడీపీకి 'ప్రత్యేక' ప్లాన్: 'కెసిఆర్! మేం భిక్షమెత్తాం'
హైదరాబాద్: వారం రోజుల్లోగా తెలంగాణ టిడిపి పూర్తిస్థాయి కమిటీ నియామాకం జరగనుందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం చెప్పారు. పార్టీ అధ్యక్షుని, వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చంద్రబాబు త్వరలో నియమిస్తారని చెప్పారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తనను తప్పించినా అభ్యంతరం లేదని, మంచి వారిని నియమించాలని తమ అభిమతమన్నారు. తెలంగాణకు ప్రత్యేక కమిటీ ఉండడం ద్వారా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందన్నారు. తెలంగాణలో కోల్పోకుండా 'స్వతంత్ర కమిటీ' చంద్రబాబు ప్లాన్‌గా చెప్పవచ్చు.

ఏపీలో 80 శాతం రుణమాఫీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరు వల్లే తెలంగాణలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఏపీలో 80 శాతం రైతు రుణమాఫీ పూర్తయిందని, తెలంగాణలో రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వడ్డీకి కూడా చాలటం లేదన్నారు.
తాము భిక్షమెత్తుకొని 500 కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఇచ్చామన్నారు. వ్యవసాయం అంటే తన ఫాంహౌస్‌లో చేసేదని కెసిఆర్ భావిస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. చిట్యాలలో మాధవరెడ్డి విగ్రహం ధ్వంసం చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ ప్రభుత్వమే విగ్రహం పునరుద్ధరించాలన్నారు.












Click it and Unblock the Notifications