• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొత్త సచివాలయం... పాత సెంటిమెంట్... డిజైన్‌లో కేసీఆర్ లక్కీ మార్క్..?

|

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముహూర్తాలు,రాశులు,వాస్తు,తిథి తదితర అంశాల పట్ల ఎంతటి విశ్వాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కాలు బయటపెట్టాలన్నా... ఏదైనా పని మొదలుపెట్టాలన్నా... ఇవన్నీ కుదిరితేనే అనుకున్నది చేస్తారు. మూఢనమ్మకాల ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా ఆయన తీరు డోంట్ కేర్ అన్నట్లుగానే ఉంటుంది. తాజాగా సచివాలయం కూల్చివేతల విషయంలోనూ ప్రతిపక్షాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్తున్న ముఖ్యమంత్రి... అక్కడ కూడా తన సెంటిమెంట్ మార్క్‌ను విడిచిపెట్టలేదు.

కేసీఆర్‌ బయోపిక్‌: తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నదెవరు

కేసీఆర్ ప్రస్థానంలో '6' చాలా స్పెషల్...

కేసీఆర్ ప్రస్థానంలో '6' చాలా స్పెషల్...

కేసీఆర్‌కు '6' అంకె లక్కీ నంబర్. ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రస్థానంలో '6'తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వాహనం నంబర్,సెల్‌ఫోన్ నంబర్.. ఇలా ప్రతీది ఆరుతో ముడిపడి ఉండేలా చూసుకుంటారు. అంతెందుకు... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ మొదటిసారి గెలిచాక ఆరో నెలలోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయనతో కలిపి ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. 2018,డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... డిసెంబర్ 6వ తేదీనే అసెంబ్లీని రద్దును ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ జీవితంలో ఆరు సెంటిమెంట్ ప్రతీ చోటా కనిపిస్తుంది.

కొత్త సచివాలయం.. 'ఆరు' సెంటిమెంట్..

కొత్త సచివాలయం.. 'ఆరు' సెంటిమెంట్..

కొత్తగా నిర్మించతలపెట్టిన సచివాలయం విషయంలోనూ కేసీఆర్ తన పాత సెంటిమెంటును వదలట్లేదన్న ప్రచారం జరుగుతోంది. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతీ అంశంలో తన లక్కీ నంబర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. '6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం,6 కాన్ఫరెన్స్ హాళ్లు,6 డైనింగ్ హాళ్లు,6 పార్కులు,60 మీ. గుమ్మటం,60ఫీట్ల రోడ్డు..' ఇలా కొత్త సచివాలయం డిజైన్‌లో అన్నింటా 'ఆరు' ప్రత్యేకత ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

లిఫ్టులు కూడా సెంటిమెంట్ ప్రకారమే..?

లిఫ్టులు కూడా సెంటిమెంట్ ప్రకారమే..?

కొత్త సచివాలయ భవనంలో ఏర్పాటు చేయబోయే లిఫ్టుల సంఖ్య కూడా '6' సెంటిమెంటుకు దగ్గరగానే ఉందన్న కథనాలు వస్తున్నాయి. మొత్తం 15(1+5=6) లిఫ్టులు ఏర్పాటు చేయబోతున్నారని... ఇక్కడ కూడా ఆరు సెంటిమెంట్ మిస్ అవకుండా ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతీ ఫ్లోర్‌లో డైనింగ్ హాల్,కాన్ఫరెన్స్ హాల్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే,మొత్తం 6 ఫ్లోర్లలో 6 డైనింగ్ హాళ్లు,6 కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేస్తారు. ఆఖరికి సెక్రటేరియట్ కూల్చివేతలను కూడా తన లక్కీ నంబర్ ప్రకారం... ఈ నెల 6వ తేదీనే ప్రారంభించారని చెబుతున్నారు.

  KCR Govt Planned For 7 Lakh Antigen Tests In The State || Oneindia Telugu
  విమర్శలను లెక్క చేయని సీఎం..

  విమర్శలను లెక్క చేయని సీఎం..

  వాస్తు నిపుణుల సలహాలు,సూచనలు పాటిస్తూనే సాధ్యమైన చోటల్లా ఆరు సంఖ్యకు ప్రాధాన్యతనిచ్చేలా సచివాలయ డిజైన్ జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా కేసీఆర్ 'ఆరు' సెంటిమెంట్ గురించి,వాస్తు సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎన్ని విమర్శలొచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోరు. వాస్తు కోసమే సచివాలయాన్ని కూలగొట్టారని ప్రతిపక్షాలు ఎంతలా విమర్శించినా... కేసీఆర్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

  English summary
  Politicians have their sentiments and beliefs,telangana CM KCR has also follow sentiments like vastu and 'six' number. KCR reviewing secretariat design and giving suggestions to officials and he is giving special importance to his lucky number six
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more