హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు అలర్ట్: స్పెషల్ లాగౌట్ మరో రెండు వారాలు పొడిగింపు
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర్ పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల క్రితం ఐటీ కారిడార్‌లో కంపెనీలకు 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించారు. అయితే, తాజాగా, ఐటీ ఉద్యోగులకు కేటాయించిన ప్రత్యేక లాగౌట్ సమయాన్ని మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు.
భారీ వర్షాల దృష్ట్యా వివిద ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంట్(PSIOC)లో సమీక్షించారు. మరోవైపు, సీసీ కెమెరాల ద్వారా కొన్ని చెరువుల్లో ప్రవాహ తీరు ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. అదనపు కమిషనర్ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ నాయక్, క్రైమ్స్ డీసీపీ కల్వేశ్వర్ సింగెనవార్, డీసీపీలు హర్షవర్ధన్, సందీప్ తదితరులున్నారు.

కాగా, నగరంలో చిన్నపాటి వర్షానికే నగరంలో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా వాహనాలన్నీ రహదారులపైకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని గుర్తించిన పోలీసులు.. ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఐటీ కంపెనీల పనివేళల్లో తగిన మార్పులు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. మూడు దశల్లో ఉద్యోగులు విధులు ముగించుకునేలా ఐటీ కంపెనీలకు సూచనలు చేశారు.
ఫేజ్ - 1 : ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ - 2 : ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.ఫేజ్ - 3 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ లాగౌట్స్ మరో రెండు వారాలపాటు అమలు కానున్నాయి.












Click it and Unblock the Notifications