నకిలీ జండూబామ్, నిర్వాహకుడు పరారీ(ఫోటోలు)
హైదరాబాద్: నగర శివారులో రహస్యంగా తయారు చేస్తున్న నకిలీ జండూబామ్ ముఠాను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 10 లక్షల విలువైన 15వేల జండూబామ్ డబ్బాలు, ముడి సరుకుతో పాటు తయారీకి వినియోగించే యంత్రాలను సీజ్ చేసి దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
ఐతే ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ విద్యాసాగర్ రావు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లా పూర్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామపరిధి సారె గూడెం శ్మశాన వాటిక సమీపంలోని సర్వే నెంబర్ 200/2లో మల్లారెడ్డి ఇంటిని కాటేదాన్‌కు చెందిన జితేందర్ కొన్ని కొన్ని నెలల క్రితం జండూబామ్ ఎగుమతి చేస్తామంటూ అద్దెకు తీసుకున్నాడు.
అక్కడ 20 మంది కూలీలతో నకిలీ జండూబామ్‌ను తయారు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ అడిషనల్ డీసీపీ రామ చంద్రారెడ్డి ఆదేసానుసారం ఎస్‌ఐలు శివయాదవ్, చైతన్యలు తయారీ కేంద్రంపై దాడి చేశారు.
నగర శివార్లలో వరుసగా నకిలీ జెండూబామ్ తయారీ కేంద్రాలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కూపీలాగే పనిలో పడ్డారు. గత ఏడాది పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి చూడగా.. గత నాలుగేళ్ల క్రితం జీడిమెట్ల గ్రామంలోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.
ఐతే గతంలో పట్టుబడిన ముఠాకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు నిర్వాహకుడు దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
కుత్బుల్లా పూర్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామపరిధి సారె గూడెం శ్మశాన వాటిక సమీపంలోని సర్వే నెంబర్ 200/2లో మల్లారెడ్డి ఇంటిని కాటేదాన్‌కు చెందిన జితేందర్ కొన్ని కొన్ని నెలల క్రితం జండూబామ్ ఎగుమతి చేస్తామంటూ అద్దెకు తీసుకున్నాడు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
సుమారు రూ. 10 లక్షల విలువైన 15వేల జండూబామ్ డబ్బాలు, ముడి సరుకుతో పాటు తయారీకి వినియోగించే యంత్రాలను సీజ్ చేసి దుండిగల్ పోలీసులకు అప్పగించారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
అక్కడ 20 మంది కూలీలతో నకిలీ జండూబామ్‌ను తయారు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ అడిషనల్ డీసీపీ రామ చంద్రారెడ్డి ఆదేసానుసారం ఎస్‌ఐలు శివయాదవ్, చైతన్యలు తయారీ కేంద్రంపై దాడి చేశారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
నగర శివార్లలో వరుసగా నకిలీ జెండూబామ్ తయారీ కేంద్రాలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కూపీలాగే పనిలో పడ్డారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
గత ఏడాది పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి చూడగా.. గత నాలుగేళ్ల క్రితం జీడిమెట్ల గ్రామంలోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
ఐతే గతంలో పట్టుబడిన ముఠాకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు నిర్వాహకుడు దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
సుమారు రూ. 10 లక్షల విలువైన 15వేల జండూబామ్ డబ్బాలు, ముడి సరుకుతో పాటు తయారీకి వినియోగించే యంత్రాలను సీజ్ చేసి దుండిగల్ పోలీసులకు అప్పగించారు.

నకిలీ జండూబామ్ ముఠాను పట్టుకున్నఎస్‌వోటీ పోలీసులు
నకిలీ జండూబామ్ డబ్బాను చూపిస్తున్న దృశ్యం.

Click it and Unblock the Notifications