తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే బాబు-కెసిఆర్ తిట్టుకుంటున్నారు, ఏపీకి హోదా బిజెపి బాధ్యతే: పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు/హైదరాబాద్: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు, ఇరు రాష్ట్రాల వారిని మభ్యపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు తిట్టుకుంటున్నారని మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

శుక్రవారం నాడు ఆయన తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావల్సిన బాధ్యత తెలుగుదేశం, బిజెపిల పైననే ఉందన్నారు.

కుల, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి చూస్తోందని వి హనుమంత రావు మండిపడ్డారు. ఇది దుర్మార్గపు ఆలోచన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రధాని మోడీ, చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలని, వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Special Status to AP responsibility on BJP and TDP: Ponnam

విద్యుత్ కొనుగోలు అవసరం ఉండదు: జెన్కో సిఎండి

వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదని జెన్కో సిఎండీ ప్రభాకర రావు మహబూబ్ నగర్ జిల్లాలో చెప్పారు. లోయర్ జూరాల జల విద్యుత్ ప్రాజెక్టును ఆయన శుక్రవారం నాడు సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. వరదలు వస్తే రెండు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జెన్కోలో చురుగ్గా ఆరువేల మెగవాట్ల విద్యుత్ ప్లాంట్ల పనులు సాగుతున్నాయని చెప్పారు.

English summary
Congress leader Ponnam Prabhakar said that Special Status to AP responsibility on BJP and Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X