చెరువుల రక్షణకు ఎన్‌ఫోర్స్‌మెంట్, సినీతారలతో క్రికెట్: హరీశ్(పిక్చర్స్)

హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమంతో గ్రామాల్లోని చెరువులను విజయవంతంగా పునరుద్ధరిస్తున్న నీటిపారుదల శాఖ, తాజాగా పట్టణ చెరువులపై దృష్టి సారించింది.
ఒకప్పుడు చెరువులతో కళకళలాడిన రాజధాని నగరానికి తిరిగి పూర్వవైభవం తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంటనగరాల్లో ఉన్న 169 చెరువుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం చుట్టనుంది.

నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మంగళవారం చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. 169 చెరువుల్లో ఇప్పటికే 34 చెరువుల పునరుద్ధరణకు 64 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్టు, ఈ చెరువుల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వీటిలో 17 చెరువుల పనులు ప్రారంభం కాగా మిగిలిన చెరువుల కోసం త్వరలోనే టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు.

హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు నిధులు సమీకరించేందుకు సినీ తారలతో బెనిఫిట్ క్రికెట్ షోను నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా గుర్తించాల్సిన చెరువులుంటే ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు.

వలస పక్షులకు నిలయమైన అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువుపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. దానిపాటు ఆ ప్రాంతంలో ఉన్న మిగతా 13 చెరువుల అభివృద్ధి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు దత్తత తీసుకున్న అమీన్‌ఫూర్ పెద్ద చెరువుపై ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్ ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువు పరిసరాల్లోని జీవ వైవిధ్యాన్ని మంత్రికి వివరించారు.

వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ చెరువు వద్దకొచ్చే అరుదైన ప్లెమింగో పక్షులు కాలుష్యం, మైనింగ్ మూలంగా బెదిరిపోతున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. దాంతో ఆ చెరువును తాను త్వరలోనే సందర్శిస్తానని మంత్రి చెప్పారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ను గుర్తించి చుట్టూ కంచె వేయాలని మంత్రి ఆదేశించారు. ఈ చెరువు చుట్టూ మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు.

హరీశ్ రావు సమీక్ష

హరీశ్ రావు సమీక్ష

మిషన్ కాకతీయ కార్యక్రమంతో గ్రామాల్లోని చెరువులను విజయవంతంగా పునరుద్ధరిస్తున్న నీటిపారుదల శాఖ, తాజాగా పట్టణ చెరువులపై దృష్టి సారించింది.

హరీశ్ రావు సమీక్ష

హరీశ్ రావు సమీక్ష

ఒకప్పుడు చెరువులతో కళకళలాడిన రాజధాని నగరానికి తిరిగి పూర్వవైభవం తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంటనగరాల్లో ఉన్న 169 చెరువుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం చుట్టనుంది.

హరీశ్ రావు సమీక్ష

హరీశ్ రావు సమీక్ష

నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మంగళవారం చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు.

హరీశ్ రావు సమీక్ష

హరీశ్ రావు సమీక్ష

169 చెరువుల్లో ఇప్పటికే 34 చెరువుల పునరుద్ధరణకు 64 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్టు, ఈ చెరువుల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ చెరువులపై సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉస్మాన్‌సాగర్ చుట్టూ కంచె నిర్మించేందుకు రూ.8.60 కోట్లు అవసరమని తెలిపారు. గండిపేట సమగ్రాభివృద్ధి కోసం రూ.37.60 కోట్లు అవసరమని ఆయన చెప్పారు.

గండిపేటను ఐదు దశల్లో అభివృద్ధి చేయాలని, నిధుల కోసం జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖలతో పాటు ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, సినీ పరిశ్రమల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.

జంట జలాశయాల అభివృద్ధి కోసం అవసరమైతే సినీ తారలతో బెనిఫిట్ క్రికెట్ షో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాన్ని ఇద్దరు ఐపీఎస్‌లు తేజ్‌దీప్‌కౌర్, సీవీ ఆనంద్ సమన్వయం చేయాలని మంత్రి కోరారు. రెండు వారాల్లో మరోసారి సమావేశమై చెరువుల పరిరక్షణపై చర్చించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+