• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రబలుతున్న డెంగ్యూ..! పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ..!!

|

హైదరాబాద్‌: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్‌లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్‌తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు...! ముందు జాగ్రత్త తీసుకోని యంత్రాంగం..!!

గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు...! ముందు జాగ్రత్త తీసుకోని యంత్రాంగం..!!

మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్‌సీజన్‌లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి-ఏప్రిల్‌ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి.

గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు కేసులు..! చోద్యం చూస్తున్న అదికారులు..!!

గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు కేసులు..! చోద్యం చూస్తున్న అదికారులు..!!

2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్‌ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చిందని డాక్టర్‌లు అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని అభిప్రాయపడుతున్నారు.

పెద్ద దావాఖానాల్లో నీళ్లు లేవ్..! యధేఛ్చగా నీటి దందా..! చోద్యం చూస్తున్న అదికారులు..!!

నిలోఫర్‌ సహా ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోజూ 10 కేసుల వరకు రాక..! పట్టించుకోని ఆరోగ్య శాఖ..!!

నిలోఫర్‌ సహా ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోజూ 10 కేసుల వరకు రాక..! పట్టించుకోని ఆరోగ్య శాఖ..!!

ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం.

 నిద్రపోతున్న వైద్య శాఖ..! ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోని వైనం..!!

నిద్రపోతున్న వైద్య శాఖ..! ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోని వైనం..!!

డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్‌ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్‌'ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్‌లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి 40 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Medical sources have claimed that the number of dengue and malaria victims are coming in everyday public and private hospitals. Malaria spread in tribal areas. There are allegations that the public health authorities are not aware of the electoral code and that the medical health department is completely ignorant of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more