కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఓ బిందువు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, అందులో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ బిందువు లాంటి వాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, అందులో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ బిందువు లాంటి వాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సోమవారం అన్నారు.
ఎందరో మహామహులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిక పెద్ద విశేషం ఏమీ కాదని చెప్పారు. తమ పార్టీని ఎవరూ ఓడించలేరన్నారు. రానున్న ఎన్నికల్లో తాము గెలుస్తామన్నారు.

రాష్ట్రంలో తమ సర్కార్ చేపడుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తాము అమలులోకి తెచ్చిన పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాంకు పార్టీ పెట్టాలని ఉందని, ఆయన పార్టీ పెట్టినా నష్టం లేదన్నారు.












Click it and Unblock the Notifications