నిండుకుండల్లా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు.. ఆవిష్కృతమైన జలదృశ్యం!

భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. నేడు జూరాల, సుంకేసుల నుండి 1, 53, 373 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే చేరుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వస్తున్న వరద ఉధృతి కారణంగా శ్రీశైలం జలాశయం జలకళతో తొణికిసలాడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 883 అడుగులకు చేరడంతో, నిన్నటి నుండి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద
మొత్తం నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయడం ఇది మూడోసారి. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల కారణంగా శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 2,23,802 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,73, 949 క్యూసెక్కులు.

Srisailam and Nagarjunasagar reservoirs are full tourists rush this is the latest situation

నాలుగు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల.. పోటెత్తిన పర్యాటకులు
శ్రీశైలం పూర్తి జల సామర్థ్యం 215.8070 క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యం 203.4290 టీఎంసీలు. ఇక శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడం తో పర్యాటకులు ఈ సుందర జల దృశ్యాన్ని చూడడానికి పోటెత్తుతున్నారు.ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో, నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండ లాగా మారింది.నాగార్జునసాగర్ లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .

నిండు కుండలా నాగార్జున సాగర్
జలాశయం వద్ద ఇన్ ఫ్లో 2,28,601 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2, 47 , 986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589. 20 అడుగులుగా నమోదయింది. నాగార్జునసాగర్ యొక్క పూర్తి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.65 టీఎంసీలకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టంతో నాగార్జునసాగర్ ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. నిండుకుండ లాగా తోస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+