SSC Exams: తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారని విద్యాశాఖ వెల్లడించింది. 4,85,826 మంది విద్యార్థుల్లో 3,78,794 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఉన్నారు.
98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను అమర్చారు. 34,500 మంది ఇన్విజిలేటర్లను పరీక్ష విధుల్లో పాల్గొన్నారు.

గతంలో ఎస్ఎస్స్సీ పరీక్షలు 11 ఉండగా.. ప్రస్తుతం వాటిని 6కు కుదించారు. ఈసారి మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలకు కేవలం 15 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. బస్సులో ప్రయాణించాలంటే రెగ్యులర్ పాస్ తోపాటు హాల్ టికెట్ కూడా చూపించారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాఫీయింగి జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications