వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SSC Halltickets:తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. పది పరీక్షల హాల్ టిక్కెట్లను ఎస్ఎస్సీ బోర్డు అధికార వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 4,94, 616 మంది హాజరుకానున్నారు. పరీక్షల కోసం 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వెబ్ సైట్
www.bse.telangana.gov.in వెబ్ సైట్ కు వెళ్లి ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ ఏప్రిల్‌ 2023 ట్యాప్ పై క్లిక్‌ చేయాలి. తర్వాత తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రెగ్యులర్‌, ప్రైవేటు, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్‌ విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతి ఇస్తామని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.

ssc halltickets released in ssc board website
9030282993
విద్యార్థులు ఒక రోజు ముందే వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్లి తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. కంట్రోల్ రూమ్ నెంబర్ 9030282993 కు ఫోన్ చేయాలని సూచించారు.ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథ్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్ స్టడీస్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.

ssc halltickets released in ssc board website
15 నిమిషాలు
ఈ సారి పదో తరగతి పరీక్షల్లో భాగంగా మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నాపత్రం రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇ‍వ్వనున్నారు. గతంలో బిట్‌ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని 15 నిమిషాలకు కుదించారు. పరీక్ష ఆఖర్లో మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.
English summary
The hall tickets for class 10 exams have been released in Telangana. The hall tickets for ten exams are made available on the official website of the SSC Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X