కూలిన సభావేదిక: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదికపై ప్రసంగిస్తున్న వేళ.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో అంతా షాక్ తిన్నారు.
బీబీనగర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదికపై ప్రసంగిస్తున్న వేళ.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో అంతా షాక్ తిన్నారు. అయితే ఘటనలో లక్ష్మణ్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన ఓ ప్రజా పంచాయితీ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. సభలో లక్ష్మణ్ ప్రసంగిస్తున్న సమయంలో.. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications