బ్రెజిల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.. AI లో యువతకు భారీగా అవకాశాలు

రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు స్టార్టప్‌ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్‌ కు చెందిన గోయస్‌ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేసే హబ్‌ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈ సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం T-Hub సీఈవో సుజిత్ జాగిర్దార్, గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్‌లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనాకు వచ్చారు. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

State Government Signs Agreement with Brazilian Company Hub GOIAS

మార్కెట్ యాక్సెస్‌తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ (T-Hub), హబ్ గోయస్ (HUB GOIAS) కలిసి పని చేస్తాయని.. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్‌ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+