Statue of Equality: నిర్మాణం వెనుక : 3డీ స్కానింగ్ - రోబోటిక్ : అంతా ప్రత్యేకమే..!!
ఈ రోజు మరో ఆథ్మాత్మిక నగరి అందరిని ఆకర్షిస్తోంది. వెయ్యేళ్ల క్రితమే కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి...విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శ్రీరామానుజాచార్య. ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భం..మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టం శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవం. శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య విగ్రహావిష్కరణ నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది.
Recommended Video

విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు
ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2013 లో ప్రారంభమైన ఈ ఆలోచనలు..2014లో విగ్రహా రూపంలో నిర్మాణం ప్రారంభం అయింది. రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శనివారం... సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు.

బెంగళూరులో 3డీ స్కానింగ్
ప్రాంగణాన్ని వందలాది రకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు. దానికి బెంగళూరులో 3డీ స్కానింగ్ చేయించారు. దాంతో ఆబ్జెక్టు ఫైల్ తయారు చేయించారు. దాన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్ తీసుకుని మాయ, మడ్‌బ్రష్ సాఫ్ట్‌వేర్లు వినియోగించి మరింత సుందరంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి సూక్ష్మ అంశాలు కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో దాదాపు 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్‌స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్‌వేర్ ఫైల్ తయారు చేయించారు. సాఫ్ట్‌వేర్ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్ కార్పొరేషన్‌కు పంపి, క్యాస్టింగ్, అసెంబ్లింగ్ పనులు అప్పగించారు.

రోబోటిక్ పరిజ్ఞానం వినియోగం
ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ పరిజ్ఞానం వినియోగించి థర్మోకోల్‌తో 1:10 మోడల్ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేయించారు. చినజీయర్‌స్వామి చైనా వెళ్లి దాన్ని పరిశీలించి సవరణలు చెప్పారు. తర్వాత మరిన్ని సవరణలతో మరో సాఫ్ట్‌వేర్ ఫైల్‌ను చైనా పంపించారు. మరోసారి థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్‌కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్‌లో తయారైన స్టీల్ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది.

15 నెలల సమయంలో నిర్మాణం
మొత్తం ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది. ఇక, ఈ విగ్రహావిష్కరణ కోసం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 టన్నుల 180 రకాల పూలు, 50 రకాల పండ్లు, కూరగాయలతో సమతామూర్తి కేంద్రాన్ని, 108 దివ్యదేశాలను అలంకరిస్తున్నారు. ఇందుకోసం చిత్తూరు, బెంగళూరు నుంచి పూలు, పండ్లను తెప్పించారు. నాలుగు రోజుల నుంచి 600 మంది సిబ్బంది నిరంతరంగా అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పుష్ప అలంకరణ పనులను స్వయంగా పరిశీలించిన శ్రీత్రిదండి చినజీయర్ స్వామి హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని చేతుల మీదుగా
పూర్తిగా రకరకాల పుష్పాలతో సమతామూర్తి విగ్రహాన్ని తయారు చేసిన సిబ్బందిని చినజీయర్ స్వామి ఆశీర్వదించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ విగ్రహావిష్కరణ సమయంలో కోట్లాది మంది తిలకించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. హెలికాప్టర్ ద్వారా ముందుగా ఈ ప్రాంగణం మొత్తం తిలకించన్నారు. త్రీ డీ ప్రదర్శన ఏర్పాటు చేసారు. రామానుజ ప్రత్యేకత..ఆయన బోధనల గురించి ప్రధాని ప్రసంగం చేయనున్నారు. విగ్రహం తయారీ దగ్గర నుంచి నేడు ఆవిష్కరణ వరకు చినజీయర్ స్వామి అంతా తానై దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఈ విగ్రహం దేశంలోని అతి ముఖ్యమైన..ప్రధానమైన విగ్రహాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications