కేసీఆర్ ప్రభుత్వంపై దశలవారీ ఉద్యమం.!పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాల్సిందేనన్న బండి సంజయ్.!

హైదరాబాద్ : కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల సంయుక్త కృషి ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు, తెలంగాణ సీఎం ఈ విషయంలో మొండిగా వ్యవహరించడంపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. పెట్రోల్ ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

ప్రజల డిమండ్ కు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు స్ఫూర్తిదాయకంగా పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించేదాకా పోరాటం..

పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించేదాకా పోరాటం..

నవంబర్ 29, 30 తేదీల్లో బీజేపీ కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో 33 జిల్లాల కేంద్రాల్లో ప్లకార్డులు పట్టుకుని నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. డిసెంబరు 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాల వద్ద చంద్రశేఖర్ రావు ప్రజావ్యతిరేక వైఖరిని చాటిచెప్పే బ్యానర్లతో భారీ నిరసనలు చేపడతారు. డిసెంబర్ 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు కొనసాగిస్తారు.

 కేసీఆర్ మొండి వైఖరి..

కేసీఆర్ మొండి వైఖరి..

పెట్రోలో, డీజిల్ పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు.

 మోదీ ఔదార్యం..

మోదీ ఔదార్యం..

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో దీపావళి సందర్భంగా ఈనెల 3న పెట్రోల్ ధరలను ఒక్కో లీటర్ పై 5రూపాయలులు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించారని, ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు తమ పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారని బండి సంజయ్ గుర్తు చేసారు.

ప్రధాని పిలుపు మేరకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలుసహా దాదాపు 23 రాష్ట్రాల ప్రభుత్వాలు ధరలను తగ్గించాయని, కానీ చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు బండి సంజయ్. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ ను తగ్గించే చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని సంజయ్ మండి పడ్డారు.

 చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి..

చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి..

అంతే కాకుండా గత ఏడాది మే నుండి ఈ ఏడాది నవంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు 8.83 రూపాయలను, డీజిల్‌పై 5.68 రూపాయలు వ్యాట్‌ని పెంచిందని, సాధారణంగా ఇన్‌పుట్ ధర పెరుగుదల సమయంలో అదనపు పన్ను విధింపును కేంద్రం అనుమతించడం లేదని, ఇది ప్రజల పట్ల కేంద్రప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని సంజయ్ వ్యాఖ్యానించారు.

చంద్రశేఖర్ రావు మాత్రం తన వాక్చాతుర్యంతో అన్నీ తనకే తెలుసుననే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రశేఖర్ రావు తీరును అర్థం చేసుకున్నారని తెలిపారు. డిసెంబర్ 5న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, డిసెంబర్ 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టనున్నాయని, డిసెంబరు 7న మైనార్టీ మోర్చా ధర్నా నిర్వహించనుందని, అయినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించకపోతే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర బీజేపి నిర్ణయించిందని బండి సంజయ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+