మలయాళ సినిమా ప్రభావం- హైదరాబాద్ స్కూళ్లల్లో మార్పులకు కలెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన.. సికింద్రాబాద్ లోని బోయిన్‌పల్లిలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బ్యాక్ బెంచీలను తొలగించాలని, వాటి స్థానంలో 'U' ఆకారంలో సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మలయాళ సినిమా 'స్థానార్థి శ్రీకుట్టన్'.. దీనికి సంబంధించిందే. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్లాస్ రూమ్ ల సీటింగ్ ఎంతగానో ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీ కథాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేరళ ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్ బెంచీలను తొలగించింది.

ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బ్యాక్ బెంచీలు.. టీచర్లు- విద్యార్థుల మధ్య దూరాన్ని పెంచుతాయని, అందుకే వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యాబోధనలో ప్రతి విద్యార్థిని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
విద్యార్థులు- ఉపాధ్యాయుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించేలా బ్యాక్ బెంచీలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని హరిచందన అభిప్రాయపడ్డారు. తరగతి గదులు, అందులో బెంచీలను U- ఆకారంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ లేఅవుట్ వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు.
ప్రత్యేెకించి- చదువులో వెనుకపడ్డ విద్యార్థులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య క్రీడలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ రెండింటినీ సమానంగా ప్రోత్సహించాలని సూచించారు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల్తలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అన్నారు.
విద్యార్థుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించాలని, దీనికోసం లెర్నింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు.. వెనుకపబడ్డ తోటి స్టూడెంట్స్ కు పాఠ్యాంశాలను నేర్పించగలరని అన్నారు.
ప్రతి విద్యార్థి కూడా మనసు పెట్టి చదవాలని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని హరిచందన సూచించారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రత్యేకించి- 6 నుండి 10 తరగతుల వరకు విద్యార్థులు డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ను ఎక్కువగా ఉపయోగించాలని కలెక్టర్ పాఠశాలలకు సూచించారు. విద్యా విషయాలపై విద్యార్థుల అవగాహనను విస్తృతం చేయడానికి TSAT వేదికను ఉపయోగించాలని ఉపాధ్యాయులను కోరారు.












Click it and Unblock the Notifications