వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు మాని.. రాష్ట్రం కోసం పనిచేయండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ హితవు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రం ప‌ట్ట‌ కేంద్రం చిన్నచూపుచూస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గత ఏడేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆరకోర నిధులను కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో చేనేత రంగానికి చేసిందేమి లేదన్నారు. చేనేత కార్మికుల భవిష్యత్తు కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నారేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా.. ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

 తెలంగాణ ప‌ట్ట కేంద్రం చిన్న‌చూపు.

తెలంగాణ ప‌ట్ట కేంద్రం చిన్న‌చూపు.

త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లోనైనా తెలంగాణకు త‌గిన నిధుల‌ను కేటాయించాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. కరోనా నివారణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై సిరిసిల్ల కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు మాని.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.

ద‌మ్ముంటే బండి సంజ‌య్ ఈ ప‌నిచేయ్‌..

ద‌మ్ముంటే బండి సంజ‌య్ ఈ ప‌నిచేయ్‌..

రాష్ట్రంలో కొత్తగా చేనేత క్లస్టర్లను, మెగా పవర్ లూం క్లస్టర్లను మంజూరు చేయించాలని బండి సంజయ్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ నేత‌లు తెలంగాణ అభివృద్ధి కోరుకునేవారైతే వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రంతో మాట్లాడి రూ. 897 కోట్లు మంజూరు చేయించాలన్నారు. అలాగే చేనేత పరిశ్రమలకు బిందువైన పోచంపల్లిలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసే బాధ్యతను తానే తీసుకోవాలన్నారు. లూమ్‌ అప్‌గ్రేడేషన్‌ పథకానికి కేంద్రం సహాయం చేయాలని, టెక్స్‌లైట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు . కేంద్ర మొండి చేయి చూపిస్తే పోరాటానికి కూడా వెనుకాడేది లేదని కేటీఆర్ హెచ్చరించారు

Recommended Video

BJP Ruling States Cant Implement Rythu Bandhu Like Telangana - KTR | Oneindia Telugu
సిరిసిల్ల ద‌శ మార్చుతాం..

సిరిసిల్ల ద‌శ మార్చుతాం..


సిరిసిల్లను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. మన ఊరు-మన బడిలో భాగంగా 510 పాఠశాలలను మూడు సంవత్సరాలల్లోనే ఆధునీకరించామని తెలిపారు. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాల్టీలలో తొలి విడుత దళితబంధు పథకం కింద లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియలో సిరిసిల్ల జిల్లా ఐదో స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో హెల్ ప్రొఫైల్ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల జిల్లా ఎంపికైందన్నారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులు ప్రారంభమవుతాని మంత్రి కేటీఆర్ వెల్లడించారు

English summary
Minister KTR Serious warning to BJP Bandi sanjay
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X