విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా!

ఒకపక్క చలికాలం కొనసాగుతున్నా ఇంకోవైపు వర్షాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పగలంతా ఎండ, సాయంత్రం ఆకస్మిక వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణాలో 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆయా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Strange weather Rains in these districts of Telangana This is AP weather report

రేపు ఈ జిల్లాలలో వర్షాలు
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో రేపు నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట, మేడ్చల్, జనగాం, యాదాద్రి, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీలో రాయలసీమ మినహా వాతావరణం పొడిగా
ఇక హైదరాబాద్లోనూ ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ మినహా అన్ని ప్రాంతాలలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈరోజు ఉదయం సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

అక్టోబర్ మాసమంతా వర్షాలే
ఇదే సమయంలో అక్టోబర్ 1 నుంచి 10 మధ్య ఉత్తర- తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అక్టోబర్ 10 నుండి 20 మధ్య ఓసారి వర్షాలు అక్టోబర్ 21 నుండి 31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+