ఐసోలేషన్ వార్డులో పనిచేసేవారికి ఎన్-95 మాస్క్: మంత్రి ఈటల రాజేందర్
కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. సున్నితమైన సమస్యపై వదంతులు ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ గడ్డ మీద ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని.. దుబాయ్‌లో వచ్చిన వ్యక్తి కూడా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం అభినందించిందని పేర్కొన్నారు.

వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను.. తూ.చ తప్పకుండా పాటిస్తోన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టంచేశారు. వైరస్ ఉన్న చోట, అనుమానిత ప్రదేశంలో పనిచేస్తోన్న సిబ్బందికి ఎన్-95 మాస్క్ ఇవ్వాలని కోరామని మంత్రి గుర్తుచేశారు. గాంధీ ఆస్పత్రిలో మరో వైరలాజీ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పేర్కొన్నారు.
Recommended Video

ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కాకుండా.. దేశం నుంచి వచ్చిన వారికి కూడా ఎయిర్ పోర్టులలో టెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఏ ఆహారమైనా తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఫంక్షన్లకు వెళ్లొచ్చని పేర్కొన్నారు. అధిక ధరకు మాస్క్ విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటలీ నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తితోపాటు.. ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరికీ పరీక్షలు చేశామని పేర్కొన్నారు. వారి రిపోర్టులు శనివారం వస్తాయని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications