హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా విద్యార్ధులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ఉస్మానియా విద్యార్ధులు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, శ్రావణ్‌లతో కలిసి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు.

త్వరలోనే రాహుల్‌ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉస్మానియాలో జరగనున్న విద్యార్ధి ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని వారు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాదు రాహుల్ గాంధీ పలు ఆసక్తికర అంశాలను కూడా ప్రస్తావించారు.

 కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించొద్దని రాహుల్ విద్యార్థులకు సూచించారు. ‘‘మీకు అండగా నేనుంటా'' అంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? అని కూడా రాహుల్ బాధ పడ్దారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదని నిందించారు.

 కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

త్వరలోనే ఓయూకు వస్తానని రాహుల్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ప్రజాస్యామ్యంపై నమ్మకం లేకపోవడం, ప్రజలతో ముఖాముఖీ మాట్లాడక పోవడం వంటి కారణాలతోనే నిరంకుశ తత్వం అలవడుతుందని, కేసీఆర్‌లో ఈ లక్షణాలు ఎక్కువని అన్నారు.

 కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

‘‘మీరంతా విద్యార్థులు. భవిష్యత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. బహుశా, మీలో ఒకరు ముఖ్యమంత్రి కూడా కావొచ్చు. కాబట్టి, ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో ఆరితేరిన వారిగా, మీ సమస్యలపై ఉద్యమించి విజయం సాధించండి'' అని ఉత్సాహపరిచారు.

 కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ విధానాలపై విద్యార్థులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఏనాడు కష్టపడలేదని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ పదవులూ వారే అనుభవిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

ఉస్మానియా భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, దాన్ని వ్యతిరేకించిన తమను జైలుకు పంపిన విషయాన్నీ రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఓయూను సందర్శించినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించాలని ఆయనను కోరారు.

 కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

రాష్ట్రంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటన వచ్చే నెలకు వాయిదా పడింది. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన తెలంగాణ పర్యటనకు వస్తారని తొలుత భావించినప్పటికీ ఆ అవకాశం లేదని తేలిపోయింది. తెలంగాణ పర్యటనపై రెండు, మూడు రోజుల్లో రాహుల్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు.

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

కేసీఆర్‌పై పోరాడండి, మీతో నేనుంటా: ఓయూ విద్యార్థులకు రాహుల్ గాంధీ

రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లిన దాదాపు 55 మంది విద్యార్థుల బృందంలో ఒకేఒక మహిళా విద్యార్థి ఉన్నారు. దీనిపై రాహుల్‌ కొంత విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరని విమర్శిస్తూనే, ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.

English summary
The student delegation requested Rahul Gandhi to visit Hyderabad and stand for their rights and pressurize the government to fulfill the promises regarding employment and other issues. TPCC's Uttam Kumar Reddy working president Mali Bhatti MLA Sampath Kumar and DK Aruna and National Secretary of NSUI Aamer Javeed were present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X