తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత సీఈవో వికాస్ రాజ్‌ను ఈసీ రిలీవ్ చేసింది. కొత్త సీఈవోగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగేదెప్పుడు?
మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం సాధ్యమయ్యేలా లేదు. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిబంధనల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అయితే, బీసీ జనాభా గణన చిక్కుముడిగా ఉందంటున్నారు. మరోవైపు, తెలంగాణ మున్సిపల్ చట్టం-2019ను అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోదించినప్పటికీ నియమ, నిబంధనలు రూపొందించలేదు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందుగానే బీసీ జనాభా గణన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కార్యరూపంలో తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా గణన నిర్వహించేందుకు కనీసం 6 నుంచి 9 నెలలు వరకు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేనట్లుగా తెలుస్తోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications