సుధాకర్ రెడ్డి హత్య: స్వాతి తండ్రి గుండు గీయించుకుని..రాజేష్ తల్లి ఇలా...
Recommended Video

నాగర్‌కర్నూలు: సుధాకర్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసిన స్వాతి, రాజేష్ విషయాల్లో వారి తల్లిదండ్రులు తీసుకున్న వైఖరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయంలో వారు తమ సంస్కారాన్ని ప్రదర్శించారనే మాట వినిపిస్తోంది.
స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ సుధాకర్ రెడ్డిని పథకం ప్రకారం చంపేసి ఆడిన డ్రామా గుట్టును పోలీసులు బయటపెట్టారు. అయితే, వారి తల్లిదండ్రులు కన్న మమకారంతో వారిని వెనకేసుకొస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

స్వాతి తండ్రి ఇలా చేశాడు....
స్వాతి తండ్రి ఆమె తన కూతురు అనే ప్రేమను కూడా చంపేసుకున్నాడు. తల ఎత్తుకుని తిరగకుండా చేసిందని భావిస్తున్నాడు. అసాధారణ రీతిలో ఆమెకు అంత్యక్రియలు జరిపించాదడు. గుండు గీయించుకున్నాడు. పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు

కుటుంబం ఇలా.
స్వాతి బెయిల్ కోసం ప్రయత్నించకూడదని ఆమె కుటుంబం నిర్ణయం తీసుకుంది. స్వాతి, సుధాకర్ రెడ్డిలది మేనరికం పెళ్లి. తన కుమారుడిని హత్య చేసింది కాబట్టి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెకు శిక్ష పడాలనే కోరుకుంటారు.

విజయవాడ వెళ్తున్నానని చెప్పి...
రాజేష్‌ది నాగర్‌కర్నూలు మండలంలోని నాగనూల్. ఓ ఫిజియోథెరపి కేంద్రంలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లికి విజయవాడ వెళ్తున్నానని చెప్పి స్వాతితో కలిసి సుధాకర్ రెడ్డిని హత్య చేశాడు. ఆమె వేసిన స్కెచ్ మేరకు ముఖం కాల్చుకుని ఆస్పత్రిలో చేరాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

రాజేష్ ఫోన్ స్వాచ్ఛాప్..
రాజేష్ కుటుంబ సభ్యులు అతని కోసం కొన్ని రోజులు అరా తీశారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. వాస్తవం తెలిసి వారు నివ్వెరపోయారు. రాజేష్ తండ్రి కొద్ది నెలల క్రితమే మరణించాడు. తల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది. అతని బెయిల్ కోసం ప్రయత్నం చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications