జగన్-మోడీ భేటీ ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షాక్, సమన్లు, ఎందుకంటే..?
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని వైయస్ జగన్ కలిసిన సమయంలో తప్పుడు కథనాలు రాశారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టుకెక్కారు. దీనిపై సమన్లు జారీ అయ్యాయి.

రాధాకృష్ణ సహా వీరిపై చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీని కలిసిన సమయంలో జగన్‌పై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించిందని పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకటశేషగిరి రావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆళ్ల హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video


ఆ కథనం ఏమిటంటే..
మే 15వ తేదీన 'అమ్మ జగనా' అంటూ జగన్‌పై అసత్యాలతో కూడిన, పరువుకు నష్టం కలిగేలా ప్రధాని మోడీకి సమర్పించిన వినతిపత్రంపై తప్పుడు కథనం ప్రచురించారని పేర్కొన్నారు.

కేసుల గురించి వినతిపత్రం అంటూ
వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధలు, మిర్చి రైతుల దుస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి తదితర అంశాలపై ప్రధాని మోడీకి జగన్ వినతిపత్రం ఇచ్చారని వైసిపి చెప్పింది. అయితే జగన్ తనపై నమోదైన కేసులకు సంబంధించి వినతిపత్రం ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి రాసిందని ఆరోపిస్తున్నారు.

మోడీజీ అని రాస్తే
ప్రధాని మోడీకి జగన్ రాసిన వినతిపత్రంలో గౌరవనీయులైన నరేంద్ర మోడీజీ అని రాశారని, కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్సలెన్సీ (సర్వశ్రేష్ట) అని రాసినట్లు పేర్కొందని అంటున్నారు. ఈ విజ్ఞాపన పత్రంపై అప్పుడే వైసిపి నేతలు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. వినతిపత్రాన్ని కూడా వైసిపి మీడియాకు చూపించింది.

దీనిపైనా కొత్త పాట అంటూ
అయితే వైసిపి చూపించిన వినతి పత్రం పైనా ఆంధ్రజ్యోతి మరో కొనసాగింపు కథనం రాశారు. 'పాత లేఖ పేరిట వైసీపీ కొత్త పాట' అనే హెడ్డింగ్‌తో వార్త రాశారు.

మోడీని జగన్ కలవడం ఇష్టం లేక
ప్రధాని మోడీని జగన్ కలవడం ఓర్చుకోలేక రాధాకృ,్ణ.. తన బృందం ద్వారా తప్పుడు కథనం రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఈ కథనం ప్రచురితం కావడానికి రాధాకృష్ణతో పాటు ఆ పత్రిక ఎడిటర్, ఏపీ, తెలంగాణ బ్యోరో ఇంచార్జ్, ఓ రిపోర్టర్ బాధ్యులు అని, వీరందరికీ సమన్లు జారీ చేయాలని ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తొలుత ఆళ్ల వాంగ్మూలం నమోదు చేసింది. తాజాగా, సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications