తెలంగాణలో ఎండ తీవ్రత ఇక మామూలుగా ఉండదట!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల చివరి నుంచే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకున్నాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మార్చి తొలి వారం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.

మార్చి నెల చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Sun intensity to increase in Telangana in last two weeks of March Meteorological Department

రాష్ట్రంలో పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మార్చి నెలలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెల చివరి రెండు వారాలు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఆ రెండు వారాలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది.

ఎండ వేడిమి పెరిగే అవకాశం ఉన్నందు వల్ల ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, నారాయణ్‌​పేట్, గద్వాల్, మహబూబ్‌​నగర్, వనపర్తి, నాగర్​ కర్నూల్​ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+