చైన్ స్నాచర్ దాడి: ఓయులో బైక్ మీంచి పడిన సునీత మృతి
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన మహిళ మరణించారు. వారం రోజుల క్రితం ఈ నెల 17వ తేదీన ఓయూ లా కాలేజీ వద్ద చైన్‌స్నాచర్ దాడిలో స్కూటర్‌పై నుంచి సునీత కింద పడ్డారు.
కింద పడడంతో ఆమె తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది. గాయపడిన సునీత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనలో చైన్‌స్నాచర్ 3.5 తులాల బంగారం అపహరించుకువెళ్లారు.

గోదావరి పుష్కరాల్లో యువకుడి మృతి
ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరిలో పుష్కర స్నానానికి దిగిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని మెదక్ జిల్లా చర్లపల్లికి చెందిన ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. గోదావరిలో దిగిన తర్వాత ఫిట్స్ రావడం వల్లే చనిపోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రదాన కారణం పొరుగింటి వారితో రెండురోజుల క్రితం జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటణా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
ప్రమాదంలో ముగ్గురు మృతి
ఖమ్మం జిల్లా: జూలూరుపాడు మండలం మాచినిపేట దగ్గర బైకును తుపాన్ వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరి పేర్లు సైదులు, వెంకటేశ్వర్లు అని బైక్‌పై పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications