కేటీఆర్ కు సుప్రీం నోటీసులు..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత వివాదంతో బీఆర్ఎస్ కలకలం కొన సాగుతోంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీపీ పదవుల వ్యవహారం రోజులకో మలుపు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. కవిత వివాదం వేళ కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ క సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చ కు కారణమవుతోంది.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్‌ చేసిన 25 వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం ఈ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మా సనం పిటీషన్‌ను విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ గతంలో మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. దీని పైన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసారు.

supreme-court-issues-notices-to-brs-working-president-ktr-details-here

కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదే అంశం పై గతంలో ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణుమ్మ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నేత ఫిర్యాదుతో కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని గతంలోనే కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణమ్మ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. పిటీషన్‌పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్‌కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వీటి పైన కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+