విభజన టైంలో లగడపాటి పెప్పర్ స్ప్రే కేసు: టి నేతకు సుప్రీంలో షాక్
రాష్ట్ర విభజన సమయంలో లోకసభలో చోటు చేసుకున్న పెప్పర్ స్ప్రే కేసును సుప్రీం కోర్టు మంగళవారం కొట్టి వేసింది.
అమరావతి: రాష్ట్ర విభజన సమయంలో లోకసభలో చోటు చేసుకున్న పెప్పర్ స్ప్రే కేసును సుప్రీం కోర్టు మంగళవారం కొట్టి వేసింది. నాడు విభజన బిల్లు పెట్టే సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లిన విషయం తెలిసిందే.
దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు దీనిని సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

నాడు జరిగిన లోకసభ సమావేశాల్లో ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది.












Click it and Unblock the Notifications