తెలంగాణ అసెంబ్లీ రద్దు: ఇక్కడ కాదు, హైకోర్టుకు వెళ్లాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కోమిరెడ్డి రాంచందర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే, శుక్రవారం పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయని, వాటన్నింటినీ హైకోర్టుకు బదలాయించామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

supreme court rejects petition over telangana assembly dissolution

ఇలాంటి సమయంలో అదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నందున ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ ఏకే సిక్కీ ధర్మానం తోసిపుచ్చింది. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు రావడం సమంజసం కాదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+