బాబూ! నీదో కాదో చెప్పు!!: నోటుకు ఓటు కేసులో బాబుపై సురవరం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టేప్‌లో ఉన్న గొంతు తనదో కాదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే విచారణకు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు.
ప్రస్తుతం సెక్షన్ 8ను అమలు చేయాల్సిన అవసరం లేదని ఆయన గురువారం మీడియాతో అన్నారు. వ్యాపం కేసులో సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించడం మంచి పరిణామమని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నైతిక బాధ్యత వహించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పంకజ్ ముండే, వసుంధర రాజే, సుష్మా స్వరాజ్, వ్యాపం కేసులు ప్రధాని నరేంద్ర మోడీ డొల్లతనానికి నిదర్శనాలని ఆయన అన్నారు.
ఉత్తరాదిన మత ఘర్షణలకు ప్ఱభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీఐ పరిధిలోకి రాకీయ పార్టీలను చేర్చడానికి తాము వ్యతిరేకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications