'క్లినికల్ ట్రయల్స్' బాధితుడు సురేష్ ట్విస్ట్: రక్త వాంతులపై ఏం చెప్పాడంటే?..

Subscribe to Oneindia Telugu

కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంట మండలం కొత్తపల్లిలో వెలుగుచూసిన క్లినికల్ కిల్లింగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఔషధ ప్రయోగాల దుష్ఫలితాలతో అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ మాట మార్చాడు.

'క్లినికల్ ట్రయల్స్' మృత్యు ఘంటికలు: కొత్తపల్లినే ఎందుకు టార్గెట్ చేశారు?, అసలేం జరుగుతోంది..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ మంగళవారం ఎంజీఎం ఆసుపత్రి నుంచి తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణలో అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నిజానికి తాను రక్తపు వాంతులు చేసుకోలేదని తెలిపాడు.

suresh escaped from mgm hospital who is effected by clinical trails

తానే ఓ సిరంజీతో ఒంటి నుంచి రక్తం తీసుకుని నోట్లో పోసుకున్నానని.. ఆపై వాంతులు చేసుకున్నట్లు కక్కుకున్నానని తెలిపాడు. అశోక్ కుమార్ అనే వ్యక్తిని తానే క్లినికల్ ట్రయల్స్ కు తీసుకెళ్లానని అతని తల్లి ఆరోపించడంతో.. భయపడి ఇలా చేశానని మీడియా ముందు సురేష్ చెప్పాడు. సురేష్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి తప్పించుకోవడం వెనుక ఫార్మా కంపెనీల ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Suresh, who is the victim of clinical trails was escaped from MGM hospital, present he was in police custody.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి