వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్ట్‌కు భూగర్భ రైల్వేలైన్: కెసిఆర్‌తో సురేష్‌ప్రభు చర్చ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. హైదరాబాద్-గుల్బర్గా మధ్య రాకపోకలు సాగించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఖాజీపేట్ ఎల్‌టిటి-ముంబయి మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.

శంషాబాద్ విమానాశ్రయానికి భూగర్భ రైలు!

తొలి భూగర్భ రైల్వేకు మార్గం సుగమమవుతోంది. శివారు ప్రాంతమైన ఉందానగర్ నుంచి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ దీన్ని నిర్మించాలని భావిస్తున్న రైల్వే శాఖ, అందుకు సాధ్యాసాధ్యాలపై సర్వే జరిపి, రిపోర్టును ఇవ్వాలని రైట్స్ (రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్)ను గతంలోనే ఆదేశించగా, ఈ మేరకు అతిత్వరలో నివేదిక రైల్వే శాఖకు అందనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ఆ సంస్థ నివేదికను అందజేయనుంది.

హైదరాబాద్ నగరానికి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైల్వే భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ చిక్కులకు కొంతమేర పరిష్కారంగా గతంలో నిర్మించిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఫలక్‌నుమా స్టేషన్‌తో నిలిచిపోయింది.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై భారతీయ రైల్వే ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు పేర్కొన్నారు. ప్రయాణికులు సులభంగా రైలు ఎక్కేందుకు వీలుగా అన్ని స్టేషన్లలోనూ ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని పదో నంబర్‌ ప్లాట్‌ఫారంలో రిమోట్‌ వీడియో లింక్‌ ద్వారా కొత్తగా ప్రవేశ పెట్టిన రెండు రైళ్లను మంత్రి ప్రారంభించారు. ఇందులో ఒకటి (రైలు నంబరు 11307) గుల్బార్గా - హైదరాబాద్‌ ఇంటర్‌ సిటీ డైలీ ఎక్స్‌ప్రెస్‌ కాగా మరొకటి ముంబై ఎల్‌టీటీ - కాజీపేట(రైలు నంబర్‌ 11083) తడోబా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉన్నాయి.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

వీటితోపాటు హైదరాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లలో 100శాతం ఎల్‌ఈడీ బల్పులు, నాగలపల్లి నుంచి తుగ్లకాబాద్‌కు టైంటేబుల్డ్‌ వీక్లీ కాంకర్‌ కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నంబరు-1లో ఏసీ విశ్రాంతి గది, డార్మిటరీ, నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రెండు లిప్టులను రిమోట్‌ సాయంతో ప్రారంభించిన అనంతరం సురేష్‌ ప్రభు మాట్లాడారు. కాచిగూడలో టర్మినల్‌, ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

హైదరాబాద్‌ నగర శివారు నాగలపల్లి స్టేషన్‌కు చేరువలో కార్గో గోదాములను నిర్మించి ఇక్కడి నుంచి తెలంగాణ జిల్లాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన రవాణా అవసరాలను తీరుస్తామన్నారు. ఈ టర్మినల్‌ తుగ్లకాబాద్‌, ఢిల్లీ, షాలిమార్‌, కోల్‌కతా నగరాలకు కార్గొ రైళ్లను నడుపుతుందన్నారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

కేంద్ర కార్మికమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ...పెద్దపల్లి - మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను ఈ ఏడాదిలోగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌, రైల్వే జీఎం రవీందర్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

రైల్వే ఆధునికతకు అంతా కలిసి కృషిచేద్దామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు పేర్కొన్నారు. సోమవారం దక్షిణమధ్యరైల్వే మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైల్‌కళారంగ్‌ ఆడిటోరియంలో జరిగిన స్వర్ణజయంతి కార్యక్రమానికి రైల్వే మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సురేష్ ప్రభు

సురేష్ ప్రభు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపుదామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శివారు ప్రాంతాలను ఎంఎంటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా రైల్వే ప్రారంభిం చింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించిన రైల్వే.. ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. విమానాశ్రయానికి చేరువగా కాచిగూడ-మహబూబ్‌నగర్ రైలు మార్గంపై ఉన్న ఉందానగర్ స్టేషన్ మీదుగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అక్కడినుంచి విమానాశ్రయం ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయి తే విమానాశ్రయం వరకు రైల్వే లైను ఏర్పాటు చేయడాన్ని జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇందుకు అదనపు టెర్మినళ్లు, రన్‌వే అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని కొంత స్థలాన్ని సిద్ధంగా ఉంచుకున్నామని చెబుతోంది. రైల్వే లైన్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విస్తరణ సాధ్యం కాదని సర్వేలో తేలితే.. ఎట్టి పరిస్థితిలో ఎంఎంటీఎస్ లైన్ ఏర్పాటుకు అంగీకరించబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.

ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా జీఎంఆర్‌తో మాట్లాడించి ఆమోదం వచ్చే లా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ జీఎంఆర్ అంగీకరించకపోతే భూగర్భ లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌తో విమానాశ్రయాన్ని అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానితో ఆదివారం నగరానికి వచ్చిన ప్రభు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన సందర్భంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది.

English summary
Railway minister Suresh Prabhu said on Monday that two time-bound greenfield terminals would be built at Cherlapalli and Nagulapalli on the city outskirts with the cooperation of the Telangana state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X