వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి ప్లాన్-భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 6వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య... భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఈ హత్య చేయించినట్లు నిర్దారించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే అతనికి మద్యం తాగించి... బండరాయితో మోది చంపినట్లు తేల్చారు. భార్యపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె ప్రియుడు,హత్య చేసిన వ్యక్తి రిమాండ్‌లో ఉన్నారు.

అసలేం జరిగింది...
కోదాడ పట్టణంలోని రాజీవ్‌నగర్‌కి చెందిన మునూరి వెంకన్న అలియాస్ రాము-సైదమ్మ దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకన్న గ్యాస్ స్టవ్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా వెంకన్న కొన్నేళ్లుగా మిర్యాలగూడ పట్టణంలో ఉంటున్నాడు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇదే క్రమంలో సైదమ్మకు రెండేళ్ల క్రితం సైదులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది.

హత్యకు స్కెచ్...
సైదులుతో భార్య అక్రమ సంబంధం విషయం వెంకన్నకు తెలిసి ఆమెను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మిర్యాలగూడ నుంచి కోదాడకు మకాం మార్చాడు. అయినప్పటికీ సైదమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతనిపై లోలోపల ఆగ్రహంతో రగిలిపోయింది. ఇదే క్రమంలో ప్రియుడు సైదులుతో కలిసి భర్త వెంకన్నను హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం మిర్యాలగూడకు చెందిన కమలాకర్ అనే వ్యక్తికి రూ.50వేలు నగదు 2 తులాల బంగారం సుపారీగా ఇచ్చింది.

నేరం అంగీకరించిన భార్య...
ఈ నెల 6వ తేదీన వెంకన్న-సైదమ్మ గొడవపడ్డారు. ఆ తర్వాత వెంకన్న ఇంటి నుంచి బయటకెళ్లాడు. ఆ విషయం సైదమ్మ... సైదులు,కమలాకర్‌లకు ఫోన్ చేసి చెప్పింది. రంగంలోకి దిగిన కమలాకర్ వెంకన్నను కలిసి తన వెంట తీసుకెళ్లాడు. మద్యంతో పాటు నీళ్లలో మత్తు మందు కలిపి తాగించాడు. వెంకన్న అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక... బండరాయితో అతని తలపై మోది హత్య చేశాడు. వెంకన్న హత్యపై మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు అందింది. అనుమానంతో అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ఆమె ప్రియుడు సైదులు,హత్యకు పాల్పడిన కమలాకర్‌లను కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications