అఫైర్ అనుమానం: భార్యనూ కొడుకును చంపేసిన కసాయి

Posted By:
Subscribe to Oneindia Telugu

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో భార్యను, కుమారుడిని హతమార్చాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నన్పూర్‌లో ఈ దారుణం జరిగింది.

ఈ ఘటనలో సంపంగి బాలమ్మ (25), ఆరు నెలల కుమారుడు వివేక్‌‌ను అక్కడికక్కడే మరణించారు. బాలమ్మకు సంపంగి శ్రీనివాస్‌తో 2016లో వివాహమైంది. వివాహం జరిగిన నాటి నుంచి దంపతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి.

చాలా సార్లు పంచాయతీలు..

చాలా సార్లు పంచాయతీలు..

గొడవల కారణంగా పెద్దల సమక్షంలో చాలా సార్లు పంచాయితీలు జరిగాయి. అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. దీంతో బాలమ్మ కొంత కాలంగా తల్లి దగ్గరే ఉంటోంది. ఇటీవల క్రిస్మ్‌సకు ముందు శ్రీనివాస్‌ వచ్చి భార్యను పంపాలని కోరాడు. అయితే పంపించలేదు.

ఇలా అతను ఒప్పించాడు..

ఇలా అతను ఒప్పించాడు..

నన్పూర్‌లోనే భార్యతో కలిసి ఉంటానని చెప్పడంతో బాలమ్మ కుటుంబ సభ్యులు అంగీకరించారు. శ్రీనివాస్‌ ఆదివారం ఉదయం మద్యం మత్తులో భార్య బాలమ్మపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. తర్వాత ఆరు నెలల వయసు గల కొడుకుపై దాడిచేశాడు.

లోపలి నుంచి అరుపులు వినిపించడంతో...

లోపలి నుంచి అరుపులు వినిపించడంతో...

అరుపులు వినిపించడంతో బయట ఉన్న వారంతా గదిలోకి వెళ్లి చూశారు. తల్లికొడుకుల రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. మృతురాలి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో నిందితుడు శ్రీనివాస్‌ చిత్తగించాడు.

అప్పటికే వారు మరణించారు..

అప్పటికే వారు మరణించారు..

బాలమ్మ, ఆమె కుమారుడు వివేక్‌లు సంఘటనా స్థలంలోనే మరణించారు. తన బిడ్డను శ్రీనివాస్‌ అనుమానంతో ప్రతిరోజూ కొట్టేవాడని బాలమ్మ తల్లి పోచమ్మ అంటోంది. సంఘటన స్థలాన్ని మంచిర్యాల పట్టణ, రూరల్‌ సీఐలు వేణు చందర్‌, ప్రమోద్‌రావు, సీసీసీ ఎస్సై ఉమా సాగర్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man in Manchiryal district of Telangana has killed his wife and son.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి