T బీజేపీ అధ్యక్షుడిగా.. ఏకగ్రీవమే - ఢిల్లీ మార్క్ నిర్ణయం..!?
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు. ఇప్పటికే ఢిల్లీ ఫైనల్ చేసిందా. ఇదే అంశం ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం.. రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ ఉందనే అంచనాలతో అధ్యక్ష పదవి కోసం పోటీ పెరుగుతోంది. ప్రధాని మోదీ - అమిత్ షా సైతం తెలంగాణ పైన భారీ అంచనాలతో ఉన్నారు. ఇక్కడ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ సామాజిక సమీకరణాలను కీలకంగా భావిస్తోంది. ప్రధానంగా తుది రేసులో ఇద్దరు నేతలు ఉండగా, పదవి కోసం రేసులో ఉన్న నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.. కాగా, దాదాపు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగానే ఉంటుందని.. కొత్త చీఫ్ పైనా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నిక ప్రక్రియ
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు ఒకే సారి నోటిపికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నంతో ముగియనుంది. ఒకటి కంటే ఎక్కవ వామినేషన్లు వస్తే.. మంగళవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకురాలిగా కర్ణాటకకు చెందిన శోభ కరంద్లాజే వ్యవహరించనున్నారు. నామినేషన్ల సమయంలోనే ఢిల్లీ నేతలు కీలక మంత్రాంగం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని కోరుకుంటున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు రేసులో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి.

తుది రేసులో ఇద్దరు
కాగా, బీజేపీ అధినాయకత్వం బీసీ వర్గానికి చెందిన నేతకే బీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీసీ సీఎం నినాదం తో బీజేపీ ప్రచారం చేసింది. పార్టీకి కలిసి వచ్చింది. దీంతో, వచ్చే ఎన్నికల పైన భారీ అంచనాల తో ఉన్న పార్టీ నాయకత్వం బీసీ నేతకే పగ్గాలు అప్పగించనుంది. ఢిల్లీ బీజేపీ నేతల సమాచారం వరకు తుది జాబితాలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఒకరితో నామినేషన్ విత్ చేయించి.. రెండో నేత అధ్యక్షుడిగా ఖరారయ్యేలా మంత్రాంగం సాగుతున్నట్లు సమాచారం.
ఏకగ్రీవం అయ్యేలా
కాగా, జులై 1న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ నేతల కసరత్తు.. సమీకరణాలు.. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల లెక్కలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఈ ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకు న్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ధర్మపురి అర్వింద్ ..ఈటల రాజేందర్‌లో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కే ఛాన్స్ ఉందని ఢిల్లీ బీజేపీ నేతల సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీలో జోష్ నింపి.. అందరినీ సమన్వయం చేసే నేతకు పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. ఒక దశలో బండి సంజయ్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతున్నా... ఢిల్లీ నేతలు మాత్రం గుంభనంగా ఉన్నారు. దీంతో.. పార్టీ నేతలంతా ఒకే తాటి పైన ఉన్నారనే సంకేతాలు ఇచ్చేలా నామినేషన్ల సమయం నుంచి.. అధ్యక్షుడి ప్రకటన వరకు ఢిల్లీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో, కొత్త అధ్యక్షుడి అధికారిక నిర్ణయం ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications