హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ కోరిక.. హారికను భర్త చంపేసి, తగులబెట్టారా?: సీటు రాలేదనేనా?

అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన హారికను హత్య చేసి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన హారికను హత్య చేసి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

డాక్టర్ కావాలనుకొని.. వివాహిత మృతి: టెక్కీ భర్తపై అనుమానాలుడాక్టర్ కావాలనుకొని.. వివాహిత మృతి: టెక్కీ భర్తపై అనుమానాలు

ఈ మేరకు పోలీసులు సోమవారం పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హారికను ఏవిదంగా హతమార్చారన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని ఏసీపీ తెలిపారు. ప్రాథమికంగా హత్య చేసినట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు.

పోలీసుల అదుపులో భర్తను, తల్లిదండ్రులు

పోలీసుల అదుపులో భర్తను, తల్లిదండ్రులు

హారిక అనుమానాస్పద మృతి, హత్యగా ప్రాథమికంగా నిర్ధారణ అయిన నేపథ్యంలో పోలీసులు ఆమె భర్త రిషి కుమార్‌ను, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

టెక్కీని అని చెప్పుకునేవాడు

టెక్కీని అని చెప్పుకునేవాడు

రిషి ఖమ్మం జిల్లాకు చెందినవాడు. అతను ఇంటర్ ఫెయిలయినట్లుగా తెలుస్తోంది. కానీ తాను సాఫ్టువేర్ ఇంజినీర్‌ను అని చెప్పుకొని తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఎక్కడో చెప్పేవాడు కాదని అంటున్నారు. రిషి కుమార్, హారికలు బంధువులు. బావామరదలు అవుతారు.

ఎంబిబిఎస్‌లో సీటు రాకపోవడంపై ఆగ్రహం

ఎంబిబిఎస్‌లో సీటు రాకపోవడంపై ఆగ్రహం

హారిక డాక్టర్ కోర్స్ చదవాలని అనుకుంది. ఇంటర్ అయిపోగానే పెళ్లి కుదిరింది. రిషి, అతని తల్లిదండ్రులు చదివిస్తామని చెప్పడంతో హారిక పెళ్లి చేసుకుంది. కోచింగ్ తీసుకుంది. అయితే ఆమెకు ఎంబిబిఎస్‌లో సీటు రాలేదు. వారం క్రితమే బిడిఎస్‌లో చేరింది.

హారికకు వేధింపులు

హారికకు వేధింపులు

ఎంబిబిఎస్ సీటు కోసం భర్త ఆమెను వేధించినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఈ గొడవ కారణంగానే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని సమాచారం.

English summary
A woman found dead in her house in LB Nagar in Hyderabad on Sunday evening. woman relatives alleged that husband may murdered her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X