వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నువ్వు తేలే: కేసీఆర్‌కు సామాన్యుడి షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదులోని పార్శిగుట్టలో భారీ ఝలక్ ఇచ్చారు ఓ స్థానికుడు. తెలంగాణ నువ్వు తేలేదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల వచ్చిందని, ఆమె పట్టుదల కారణంగా సాధ్యమైందని కేసీఆర్ ముందే కుండబద్దలు కొట్టాడు స్వామి అనే వ్యక్తి.

స్వచ్ఛ హైదరాబాద్‌‌లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం పార్శిగుట్టకు వచ్చారు. స్థానిక బస్తీ పెద్దలతో సమావేశమయ్యారు. బస్తీ సమస్యలు చెప్పాలని కోరారు. పలువురు మాట్లాడారు. అదే సమయంలో పార్సీ గుట్టకు చెందిన స్వామి అనే వ్యక్తిని కేసీఆర్‌ స్వయంగా పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

ఇరుకు గదులు, సందులు, గొందులు, రోడ్లపై పొర్లే మురికి కాలువల వంటీ బస్తీల దుర్భర పరిస్థితులను శాశ్వతంగా పరిష్కరించడం కోసమే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

తనలాగే 465 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు వివిధ బస్తీల్లో తిరగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారని, వాటి పరిష్కారానికి ప్రజల సహకారంతో శాశ్వత చర్యలు చేపడుతామన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బస్తీల సందర్శన సందర్భంగా ప్రజలతో పలుచోట్ల ముఖాముఖిగా మాట్లాడారు.

 స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేదని, కావాల్సిందిల్లా ప్రజల సహకారమేనని కేసీఆర్ అన్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

పార్శిగుట్టతో పాటు సికింద్రాబాద్‌లో చాలా బస్తీల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. వాటిన్నింటిలో మార్పు రావాలని, నిరుపేదలు సైతం అన్ని సౌకర్యాలలతో గౌరవప్రద జీవితం గడపాలన్ననే తన ఆశయమన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

రహదారులను వెడల్పు చేయాలన్నా, నాలాలను సరిగా నిర్వహించాలన్నా కొంత మేర కూల్చివేతలు తప్పవని కేసీఆర్ స్పష్టం చేశారు.

 స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

కూల్చివేతల్లో ఇళ్లు కోల్పేయే వారు ప్రభుత్వానికి సహకరిస్తే వారికి మరోచోట పునరావాసం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

మాములు మందులతో నయం కాని రోగాలకు శస్త్ర చికిత్స ఎలా అవసరం అవుతుందో, ప్రస్తుతం నగరంలోని బస్తీలకు కూడా శస్త్ర చికిత్స చేయాలన్నారు.

 స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

కేవలం నాలుగు రోజులు బస్తీలలో తిరిగి చేతులు దులుపుకోబోమని, వచ్చే నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇక్కడె ఉండి పనులు చేస్తుందని అన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్


ఇరుకు గదులు ఉన్న ఇళ్లను, పాడుబడిన ఇళ్లను తొలగించి దశల వారిగా కొత్త ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. బస్తీలను బాగు చేసే శక్తిని ప్రజలే తమకు ఇవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

చెత్త సేకరణ కోసం ప్రభుత్వమే ప్రతి ఇంటికి రెండు ప్లాస్టిక్ బుట్టలను సరఫరా చేయడంతో పాటు చెత్త సేకరణకు కావాల్సినన్ని రిక్షాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

బస్తీలలో ఉన్న అర్హులకు పెన్షన్లు, ఇళ్లు కట్టిస్తామని, దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ప్రభుత్వమే ఖర్చుల భరించి చికిత్సలు చేయిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ విద్యాసంస్థలను, వైద్య కేంద్రాలను, పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

అశోక్ నగర్‌లో నీటి ఎద్దడి ఉందని స్థానికులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే, అక్కడ ఐదు బోర్లు వేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్


అదే ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ క్యారమ్స్ ఆటగాడు శ్రీనివాస్ ముఖ్యమంత్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని కోరగా తప్పకుండా సాయం చేయనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగింది వాస్తవమని కానీ, రాష్ట్రం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సేనని, నువ్వు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్‌ వల్లనేనని, సోనియా పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. షాకైన కేసీఆర్ దానిపై ఏమాత్రం స్పందించలేదు.

ఇందిరా గాంధీ హయాంలోనే తాను కాంగ్రెస్‌లో చేరానని, అప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉంటున్నానని స్వామి చెప్పారు. బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే ముందుగా బస్తీల్లో సమస్యలు పరిష్కరించాలని, తన చిన్నప్పుడు ఈ ప్రాంతంలో చెరువు ఉండేదని, అక్కడ హోలీ పండుగకు కాముడు కాల్చేవాళ్లమన్నారు.

English summary
Swachh Hyderabad: KCR Clears Garbage at Parsigutta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X