ఓ రాత్రి తనతో గడపాలని..: అజ్ఞాతవ్యక్తి వేధింపులపై స్వాతి నాయుడు సంచలనం
హైదరాబాద్: తెలుగులో అడల్ట్ నటిగా ముద్రపడ్డ స్వాతినాయుడు వంశీ అనే ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. తనతో ఓ రాత్రి లైంగికంగా గడపాలని సదరు అజ్ఞాత వ్యక్తి వేధిస్తున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో పోస్టు చేసింది. దీనిపై తాజాగా పోలీసులు స్పందించడం.. కేసును మరో మలుపు తిప్పింది.

తనతో గడపాలని వేధింపులు
తనను సంప్రదించకుండానే వంశీ అనే ఓ అజ్ఞాతవ్యక్తి తన ఖాతాలో రూ. 50 వేలను వేశాడని, ఓ రాత్రి గడపాలని ఒత్తిడి తెస్తున్నాడని స్వాతి నాయుడు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కేసు పెట్టడానికి వెళ్తే..
తనపై జరుగుతున్న వేధింపుల గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్లినట్టు స్వాతినాయుడు చెప్పింది. అయితే కేసు తమ పరిధిలోకి రాదని చెబుతూ తనను పలు స్టేషన్లకు తిప్పారని, చివరకు కేసు పెట్టలే

ఆ డబ్బు పోలీసులే వేశారా?:
స్వాతి నాయుడు విషయంలో అటు మీడియా సైతం నిజానిజాలను నిర్దారించే పనిలో ఉంది. ఇంతలోనే పోలీసుల నుంచి దీనిపై స్పందన రావడం గమనార్హం. స్వాతి నాయుడుకు సంబంధించిన పలు సాక్ష్యాలు సేకరించేందుకు.. తామే ఆమె ఖాతాలో డబ్బులు వేశామని పోలీసులు వెల్లడించినట్టు తాజాగా ఓ ప్రచారం జరుగుతోంది.

ఫోన్ నంబర్స్ వెల్లడించిన స్వాతి..
స్వాతి నాయుడు వివరాల్ని సేకరించేందుకు.. ఆమె యాక్టివిటీస్ పై నిఘా పెట్టిన పోలీసులే ఆమె ఖాతాలో డబ్బు వేశారన్న ప్రచారంపై పూర్తి క్లారిటీ మాత్రం లేదు.
మరోవైపు స్వాతినాయుడు తనను వేధిస్తున్న వంశీ ఫోన్ నంబర్ అంటూ వీడియోలో పేర్కొన్న నంబర్.. రాహుల్ అనే మరో వ్యక్తిది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వంశీ సన్నిహితుడైన మరో వ్యక్తి నంబర్ కూడా ఆమె బహిరంగంగానే వెల్లడించింది. ఈ కేసు చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications