వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల నిభంధ‌న‌ల‌కు పాత‌ర‌..! తెలంగాణ‌లో య‌ధేచ్చ‌గా ఏక‌గ్రీవ తీర్మాణాల జాత‌ర‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: లోక్ స‌భ ఎన్నికల అభ్య‌ర్థుల గెలుపు తెలంగాణ ప్రజాప్ర‌తినిధులకు ప్ర‌తిష్టాత్మంగా తీసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఛాలెంజ్ గా తీసుకోవ‌డంతో పాటు గెలుపు కోసం అంద‌రూ క్రుషి చేయాల‌న్న గులాబీ బాస్ ఆదేశాలు తూచా త‌ప్ప‌కుండా పాటించేంద‌కు ప్ర‌జాప్ర‌తినిధులు రెఢీ అవుతున్నారు. ఇదే క్ర‌మంలో కొన్ని స‌ర్క‌స్ ఫీట్ల‌ను త‌ల‌పించే కార్య‌క్ర‌మాల‌కు సైతం రూక‌ల్ప‌న చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీ అభ్య‌ర్థుల స్థానాల‌ను ప‌దిలం చేసుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఏక‌ప‌క్షంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను గెలిపిస్తామ‌ని ప్ర‌మాణాలు గాని, ప్ర‌తిజ్ఞ‌లు గాని చేయ‌రాద‌ని ఎల‌క్ష‌న్ క‌మీస‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన‌ప్ప‌టికి త‌లెంగాణ లోని ప్ర‌జానికం వాటిని బేఖాత‌రు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగుల గెలుపుకోసం నాయ‌కులు విచిత్ర కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా, పోలింగ్ బూత్ లోప‌లికి వెళ్లే స‌మ‌యానికి అవి గుర్తుంచుకునే అవ‌కాశం ఉంటుందా అనే సందేహంతో కొత్త కొత్త కార్య‌క్ర‌మాల‌కు టీఆర్ఎస్ నాయ‌కులు రూక‌ల్ప‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క వ‌ర్గాల్లో గులాబీ ఓట‌ర్లు త‌మ మ‌న‌సును మార్చుకుని ఇత‌రులకు ఓటు వేయ‌కుండా ఉండేందుకు గులాబీ నాయ‌కులు స‌రికొత్త ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్టు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

swearing season in telangana..! pro swearing for mp candidates..!

లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్య‌తో తెలంగాణ ప్ర‌జానికం చేత బ‌ల‌వంత‌పు ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్నారు తెలంగాణ నాయ‌కులు. తెలంగాణ ప్ర‌భుత్వానికి త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీకి ఓటేసే ప్ర‌స‌క్తే లేద‌ని తీర్మాణాలు చేయించుకుంటున్నారు. తాజాగా భువ‌న‌గిరి లోక్ స‌భ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిని గెలుపును కాంక్షిస్తూ కేశారం గ్రామ‌స్తులు ప్రతిజ్ఞ చేయ‌డం అంద‌రి ద్రుష్టిని ఆక‌ర్శించింది. గ్రామంలో అందుబాటులో ఉన్న మ‌హిళ‌ల‌ను, యువ‌త‌ను గ్రామంలోని దేవాల‌యం వ‌ద్ద‌కు ఆహ్వానించి ఇలాంటి ప్ర‌తిజ్ఞ‌లు చేయించుకోండం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ప్ర‌మాణం చేసిన ప్ర‌తి గ్రామ‌స్తుడు కారు గుర్తుకు ఓటేస్తాడా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

English summary
a wondering political actions are taking place in telangana. to get victory in next elections the leaders of telangana taking forceful swearing in favour of government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X