హరీష్ తో వీహెచ్ భేటీ - రేవంత్ కు జగ్గారెడ్డి ఓపెన్ సవాల్ : అసమ్మతి నేతల భేటీలో ఏం తేల్చారు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో అగ్గి రాజుకుంది. కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం ఒక్కటవుతోంది. హైకమాండ్ వద్దని సూచించినా..తాము పార్టీ కోసమే మాట్లాడుకుంటున్నామంటూ సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత జగ్గారెడ్డి మరోసారి రేవంత్ టార్గెట్ గా చెలరేగి పోయారు. అటు సీనియర్ నేత వీహెచ్ మంత్రి హరీష్ తో భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ కు ఛాలెంజ్ చేసారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సంగారెడ్డి నుంచి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని వెల్లడించారు.

రేవంత్ సవాల్ ఒప్పుకుంటే
టీఆర్ఎస్ - బీజేపీతో పాటుగా కాంగ్రెస్ కూడా తమ అభ్యర్ధిని నిలబెట్టి..పీసీసీ చీఫ్ తమ అభ్యర్ధిని గెలిపించి నిరూపించుకోవాలని సవాల్ చేసారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి గెలిస్తే రేవంత్ హీరో అని నమ్ముతానన్నారు. తాను గెలిస్తే..రేవంత్ జీరో అని ఒప్పుకోవాలని ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అభ్యర్ధి.. తాను ఇద్దరం ఓడితే గెలిచిన అభ్యర్ధి హీరో అని తేల్చి చెప్పారు. రేవంత్ పార్టీని నాశనం చేస్తున్నాడని..వ్యక్తిగత అజెండాతో ఒన్ మ్యాన్ షో చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
పార్టీని నాశనం చేసే నాయకత్వం ఎలా అంగీకరిస్తా మని ప్రశ్నించారు. తమకు కాంగ్రెస్ అంటే గౌరవం ఉందని... తమకు నాయకులు సోనియా - రాహుల్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుతున్నది కాంగ్రెస్ పార్టీ పంచాయితీ కాదన్నారు. ఇది రేవంత్ కు తమకు జరుగుతున్న వ్యవహారమని చెప్పారు.

వీహెచ్ మంత్రి హరీష్ ను కలవటం వెనుక
2018లో రేవంత్ అంత సమర్ధుడు అయితే ఎందుకు ఓడిపోయాడని నిలదీసారు. రేవంత్ మగాడైతే..తన ఛాలెంజ్ స్వీకరించాలంటూ వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి తెస్తాడని రేవంత్ భజన టీం చెబుతోందని..ఒక్కడూ ఎలా తెస్తాడని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇక, వీహెచ్ మంత్రి హరీష్ ను కలవటం పైనా జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వీహెచ్ తన కుమార్తె మెడికల్ సీటు గురించే కలిసారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పనులు ఉంటే వెళ్లి మంత్రులను కలవటం లేదా అంటూ నిలదీసారు. ఇందులో వీహెచ్ ను తప్పుబట్టటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సమావేశం పైన పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సమావేశం రేవంత్ కు వ్యతిరేకంగా జరిగింది కాదన్నారు.

పార్టీ మనుగడ కోసమే ఆరాటం
పార్టీ రాష్ట్రంలో 2014, 2018లో ఓడిపోయిందని..గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో జరుగుతున్న పొరపాట్లు సరిదిద్దుకోవం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పార్టీ క్లిష్ల పరిస్థితుల్లో ఉందని..అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే ముందుకు వెళ్తుందని శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ స్థాయిలో సమస్యల్లో ఉన్న పార్టీకి ఇప్పుడు తెలంగాణలోని అంతర్గత కుమ్ములాటలు మరో సమస్యగా మారాయి. దీంతో..తెలంగాణ కాంగ్రెస్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications